KTR on Compensation for Rain Victims : రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం ఐదు లక్షల రూపాయలే నష్టపరిహారంగా ప్రకటించడం అన్యాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారని ఆయనన్నారు.
✳️ రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించడం అన్యాయం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
— BRS Party (@BRSparty) September 2, 2024
✳️ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలి.
✳️ గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్… https://t.co/OzVCKjOxLX
ఈ మేరకు గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఎక్స్ పోస్ట్‌ను కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించాలని కోరారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ముందస్తు ప్రణాళిక లేకపోవటం వల్లే : వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, నష్టపోయిన వారికి రూ. రెండున్నర నుంచి ఐదు లక్షల వరకు సాయం చేస్తామన్నారని, ఆ హామీని కూడా నేరవేర్చాలని కేటీఆర్ కోరారు. ప్రభుత్వం అసమర్థత, చేతగాని తనం, ముందస్తు ప్రణాళిక లేకపోవటం కారణంగానే ప్రాణనష్టం జరిగిందని కేటీఆర్ అన్నారు. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాహుల్ జీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది : చర్యలు తీసుకోవాలని కేవలం సూచించడం మాత్రమే కాదని, విపత్కర సమయంలో ప్రభుత్వం సహాయ చర్యలు వేగవంతం చేసేలా, బాధ్యత తీసుకునేలా చూడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. వరదల సాయం విషయమై రాహుల్ గాంధీ ఎక్స్ లో చేసిన పోస్ట్‌పై కేటీఆర్ స్పందించారు. రాహుల్ జీ, తెలంగాణ ప్రజల తీర్పు పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
Rahul Ji, your government and CM have failed the people of Telangana and their mandate. It's not enough to just urge action, you must ensure your Government steps up in relief efforts and holds accountability for this disaster
— KTR (@KTRBRS) September 2, 2024
Telangana's vision has been shattered by your… https://t.co/q8FvizS3GY
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం తెలంగాణ విజన్‌ను దెబ్బతీస్తోందని, పార్టీ రోజురోజుకూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణపై నిజంగా శ్రద్ధ ఉంటే అనే సందర్భాల్లో పార్టీ తరపున నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక హాని జరగదని అన్నారు. ఈ వ్యవస్థీకృత వైఫల్యానికి కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆరోపించారు. అద్భుతం కోసం భగవంతుణ్ని ప్రార్థిస్తూ, ప్రజలు తమను తామే రక్షించుకుంటే ఎన్నుకున్న ప్రభుత్వం ఎందుకని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ప్రశ్నించారు
వరద బాధితులపై లాఠీఛార్జీనా? : ఖమ్మంలో వరద బాధితులపై లాఠీఛార్జిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరదలో రాణి, ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే, ప్రభుత్వం స్పందించదని, మధిర నుంచి వారి బంధువులు గజ ఈతగాళ్లని తెచ్చి ప్రాణాలు వారే కాపాడుకోవా మండిపడ్డారు.
ఉదయం నుండి సాయంత్రం దాకా వరదలో రాణి గారు, వారి 3 పిల్లలు చిక్కుకుంటే, ప్రభుత్వం స్పందించదు. మధిర నుండి వారి బంధువులు గజ ఈతగాళ్ళని తెచ్చి ప్రాణాలు వారే కాపాడుకోవాలి
— KTR (@KTRBRS) September 2, 2024
ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే, ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి 9 ప్రాణాలు కాపాడాలి
ధైర్యం చెప్పి… https://t.co/V6lthpwe6P
ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే, ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి 9 ప్రాణాలు కాపాడాడని ఎద్దేవా చేశారు. ధైర్యం చెప్పి రక్షించాల్సిన మంత్రులు, చివరికి దేవుడే దిక్కు అని చేతులెత్తేశారని ఆక్షేపించారు. వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీఛార్జీలతో వారిని హింసిస్తారా ? సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఏడతెగని కన్నీరు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 2, 2024
ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు,
కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలి.…
కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోండి : ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు, వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కు పోతుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్‌రావు అవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని, సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసు పెట్టి చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు తెలిపారు. విద్యుత్ సరఫరాను పునర్ధరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులందరికి ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలన్నారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలవిలలాడుతుందని, వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదముందని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖలు అప్రమత్తం కావాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి పదివేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.