ETV Bharat / state

మూణ్నాళ్ల ముచ్చటగా పులివెందుల ల్యాబ్‌ - నిరుపయోగంగా ప్రజాధనం - Testing Lab in Pulivendula

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Former CM Jagan Inauguration of Central Testing Laboratory in Pulivendula : వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా పులివెందులలో ఏర్పాటు చేసినా పరిశోధనా కేంద్రం కనిపిస్తోంది. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా గతేడాది హడావిడిగా జగన్​ ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పనులు జరగకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది.

TESTING LAB IN PULIVENDULA
TESTING LAB IN PULIVENDULA (ETV Bharat)

Former CM Jagan Inauguration of Central Testing Laboratory in Pulivendula : వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యానికి, ప్రజాధనం వృథాకి పులివెందులలో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ల్యాబ్ ప్రారంభించిన మూణ్ణాళ్లకే మూలన పడటంతో కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. ప్రజా శ్రేయస్సు కన్నా ప్రైవేటు డెయిరీలపై కక్ష సాధింపునకు హడావుడిగా "స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ"ని అప్పటి సీఎం జగన్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ పరిశోధనా కేంద్రానికి రూ. 11 కోట్ల నిధుల్ని వెచ్చించిన జగన్‌ ప్రభుత్వం తిరుమలలో ల్యాబ్‌కు మాత్రం రూ. 75 లక్షలు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కల్తీని గుర్తించేందుకు వీలుగా ల్యాబ్​ : వైఎస్సార్​ జిల్లా పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయి పశు పరిశోధన కేంద్రం ఏపీ కార్ల్. ఈ కేంద్రంలో 9-11-2023న సీఎం హోదాలో జగన్‌ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా పాలు, పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతున్నట్లు అప్పట్లో ఆరోపించిన వైఎస్సార్సీపీ ఈ ల్యాబ్​ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎగుమతులకు పెంపొందించేందుకు వీలుగా పాలు, పాల ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్, పశువైద్య అవశేషాలు, మైకో టాక్సిన్లు, వ్యాధి కారకాలను గుర్తించవచ్చని తెలిపారు.

వంతెనల నిర్వాహణలో జగన్​ జాప్యం-ప్రమాదం అంచున నిత్యం రాకపోకలు - PEOPLE SUFFER DUE TO DAMAGED BRIDGE

ప్రైవేటు డెయిరీలపై కక్ష సాధింపుగా : 15 మంది నిపుణులను నియమిస్తున్నామంటూ వైఎస్సార్సీపీ పాలకులు ప్రగల్బాలు పలకగా ఇప్పటి వరకు తాళాలే తెరుచుకోలేదు. పాలు, పాల ఉత్పత్తుల పరిశోధనతో పాటు ఆహార ధాన్యాలు, తృణ ధాన్యాలు, పప్పుల నమూనాల విశ్లేషణ, ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణ అందుబాటులో సేవలందిస్తారని చెప్పినా ప్రయోజనం శూన్యం. రాష్ట్రంలో పాల డెయిరీలు టీడీపీ సానుభూతి పరులకు ఉన్నాయనే కక్ష్యతో ఈ ల్యాబ్ తీసుకొచ్చారన్న విమర్శలు ఉన్నాయి.

అక్కరకు రాని అరటి ప్రాసెసింగ్‌ యూనిట్ : పులివెందుల మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి ప్రాసెసింగ్‌ యూనిట్​ను రూ. 20 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించారు. 6 నెలల కిందట ముఖ్యమంత్రి హోదాలో జగన్ దీనిని ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న నాలుగు కోల్డ్ స్టోరేజ్లు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు ప్రీ కూలింగ్ చాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 టన్నుల వేబ్రిడ్జితో పాటు అరటి, చీనికి సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ వినియోగంలోకి తీసుకురాకపోగా విద్యుత్ బిల్లుల బకాయిలు మాత్రం రూ. 49 లక్షలకు చేరుకుంది. విద్యుత్ వినియోగించనప్పటికీ కనీస ఛార్జీల కింద బిల్లులు విధిస్తుండడంతో భారం పెరుగుతూనే ఉంది.

అసంపూర్తిగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలు - కూటమి రాకతో ప్రజల్లో చిగురించిన ఆశలు - Vuyyuru Govt Offices

ప్రజాధనం నిరుపయోగం : అరటి ఉప ఉత్పత్తుల తయారీ కోసం సమీపంలోనే మరో యూనిట్​ను రూ. కోట్లు వెచ్చించి స్థాపించగా దీన్ని గత ఏడాది అక్టోబరు 4న జగన్ ప్రారంభించారు. దీనికి అనుబంధంగా సోలార్ గ్రీన్ హౌస్ డ్రైయర్ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అరటిపండ్లను ముక్కలుగా కోసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకునేలా యూనిట్ స్థాపించారు. అరటి కాండం నుంచి తీసిన నారను ఫైబర్​గా మార్చడంతో పాటు ప్లేట్లు, కప్పులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునేలా ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు వీటి తయారీ, మార్కెటింగ్ జరగలేదు.

జగన్​ సర్కార్​ నిర్లక్ష్యంతో కాలువలు పాయే, పంటల పోయో - YSRCP neglect maintenance of canals

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.