ETV Bharat / state

పాడైపోయిన మటన్‌తో బిర్యానీ - అల్ఫా హోటల్‌కు ఫైన్ - SECUNDERABAD ALPHA HOTEL FINED - SECUNDERABAD ALPHA HOTEL FINED

Food Safety Officials Fined Alpha Hotel : సికింద్రాబాద్‌లో షాపింగ్ కోసమో ఇతర ఏ పనిమీద వెళ్లినప్పుడైనా కాస్త ఆకలేసిందంటే అందరి చూపు వెళ్లేది అల్ఫా హోటల్‌పైనే. అక్కడ టేస్టీఫుడ్ అతి తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువ మంది అక్కడే భోజనం చేయడానికి మక్కువ చూపిస్తారు. అందుకే అల్ఫా హోటల్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆ హోటల్‌లో పాడైన మటన్‌తో బిర్యానీ వండినట్లు తనిఖీల్లో తేలినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ హోటల్‌కు ఫైన్ విధించారు.

Food Safety Officials Raids in Alpha Hotel
Food Safety Officials Imposed Fine in Alpha Hotel (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 1:04 PM IST

Updated : Jun 20, 2024, 6:23 PM IST

Food Safety Officials Raids in Alpha Hotel : సికింద్రాబాద్​లోని ఆల్ఫా, రాజ్​ బార్​ అండ్​ రెస్టారెంట్​, సందర్శిని హోటళ్లలో ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటళ్లలో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించలేదని అధికారులు గుర్తించారు. రెండు రోజలు క్రితం తనిఖీలు నిర్వహించిన అధికారులు ఇవాళ వాటికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఆహారాన్ని ఫ్రిజ్​లో పెట్టి వేడి చేసి కస్టమర్లకు : సికింద్రాబాద్​లోని ఆల్ఫా హోటల్​లో టాస్క్​ఫోర్స్​ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్​తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన ఆహారాన్ని ఫ్రిజ్​లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ హోటల్​తో పాటు సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్​లలో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా ఉన్న వంటశాలను గుర్తించారు. హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండడం, దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు. ఆల్ఫా హోటల్​లో తయారు చేసే బ్రెడ్​తో పాటు ఐస్​క్రీమ్ వంటివి ఎక్స్‌పైరీ డేట్ లేకుండా ఉన్నాయని గుర్తించిన అధికారులు ఆల్ఫా హోటల్​కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు ఫైన్ విధించారు.

Food Safety Officials Raids in Alpha Hotel
అపరిశుభ్రమైన కిచెన్ (ETV Bharat)

అమ్మో!! హోటల్ ఫుడ్డా? నేను రాను బాబోయ్ - ఎంచక్కా ఇంటికెళ్లి తింటాను - FOOD SAFETY VIOLATIONS IN HYDERABAD

సికింద్రాబాద్​కు రోజుకూ వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతుంటారు. అక్కడ హెటల్​ బిజినెస్​ బాగా నడుస్తుంది. అక్కడికి షాపింగ్ కోసం వచ్చే వారు, ఇతర పనులు మీద వెళ్లిన వారు, ముఖ్యంగా విద్యార్థులు ఆల్ఫా హోటల్​లో తినడానికి ఇష్టపడుతుంటారు. ఆ హోటల్​లో విక్రయించే బేకరీ వస్తువులు, బిర్యానీ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. తక్కువ ధరకు టేస్టీ ఫుడ్ దొరుకుతుందని ఎప్పుడు వెళ్లినా అక్కడ రద్దీగా ఉంటుంది. అయితే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ప్రజల అవసరాలే ఆసరాగా : ఇటీవల ఆహార భద్రతా అధికారులు హోటళ్లలో కొరజా ఘుళిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేస్తూ సీజ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు హోటళ్ల తీరును చూసి అధికారులు షాక్​కు గురవుతున్నారు. కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహారపదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయట ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు. ఒకపూట కడుపు మాడ్చుకున్నా ఫర్వాలేదు ఇంటికెళ్లి వండుకుని తినాలి అని ప్రజలు నిర్ణయానికి వచ్చేలా రెస్టారెంట్ల తీరు ఉంది.

ఐస్​క్రీమ్​లో ఫంగస్ - చుట్టూ అపరిశుభ్ర వాతావరణం - భద్రాచలంలో ఆ హోటల్​ సీజ్

శుభ్రత లేని కిచెన్ - పురుగులు పట్టిన ఐస్​క్రీమ్

Last Updated : Jun 20, 2024, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.