Four Children Died after Eating Contaminated Food: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో చిన్నారులను కలుషిత ఆహారం కాటేసింది. రెండు రోజుల క్రితంలో ఓ వసతి గృహంలో 48 మంది విద్యార్థుల అస్వస్థత గురైన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ మత సంస్థ అల్లూరి మన్యం జిల్లాలోని చింతపల్లి, కొయ్యూరు, గూడెం కొత్త వీధి, పాడేరు, అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది. ఈ సంస్థలో సుమారు 86 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టల్‌లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు ఉంటున్నారు. వీరు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు.
చిన్నారులకు శనివారం సాయంత్రం అల్పాహారంగా సమోసాలను పెట్టారు. రాత్రికి బిర్యాని పెట్టారు. వాటిని తిన్న కొంతసేపటికి విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను నిర్వాహకులు ఇంటికి పంపించేయడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. ఇవాళ చింతపల్లి మండలం నిమ్మలపాలెం చెందిన జాషువా, కొయ్యూరు మండలానికి చెందిన భవాని, చింతపల్లికి చెందిన శ్రద్ధ అనే మరో చిన్నారి మృతి చెందింది.
ప్రేమించమని బాలికపై యువకుడు ఒత్తిడి - ఆపై ఏం చేశాడంటే? - Rape on girl in Ntr District
మరొకరి పరిస్థితి విషమం: ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వారిలో 48 మంది చిన్నారులు అస్వస్థతకు గురికాగా అకాపల్లి జిల్లాకు చెందిన 27 మందిలో ముగ్గురు మృతి చెందారు. మిగిలిన 23 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. విశాఖ కేజీహెచ్‌లో 14 మందికి వైద్యం అందిస్తుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఐదుగురు, పాడేరులో ఇద్దరు, చింతపల్లిలో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు.
బాధిత కుటుంబాల సభ్యులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను ఆర్డీఓRDO జయరాంతో కలిసి జాహ్నవి పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని వెల్లడించారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - పరిస్థితి విషమం - Farmer Suicide Attempt
సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి: ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటన తనను కలచి వేసిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అనకాపల్లి, అల్లూరి జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది విద్యార్థులకు సరైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించానన్నారు.
హోంమంత్రి ఆరా: విద్యార్థుల మృతిపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో ఫోన్‌లో మాట్లాడిన అనిత అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి ఆదేశించారు.