Flood Relief Programmes in Vijayawada : బుడమేరు వరద ఉద్ధృతికి విజయవాడ అతలాకుతలమైంది. గత కొద్ది రోజులుగా ముంపు ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గిపోవడంతో అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులకు ఆహార పొట్లాలు, పాలు, నీళ్లు, పండ్లు పంపిణీ, వైద్య సహాయం అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఇతర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కార్మికులు, ఫైరింజన్లు, వైద్యుల బృందం విజయవాడకు చేరుకున్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు : విజయవాడలో వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య పనులు ముమ్మరం కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు తొలగిస్తుంటే, మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. పలు ముంపు ప్రాంతాల్లో మాత్రం రహదారులపై ఇంకా నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలోనే నగరపాలక సంస్థ బృందం పురిటి నొప్పులతో బాధపడుతున్నా నిండు గర్భిణీని రక్షించి బోట్లోనే ప్రసవం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇంటింటి సర్వే చేపట్టిన వైద్యులు : విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టింది. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యబారిన పడకుండా 108, 104 సంచార వాహనాల ద్వారా ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో వైద్యులు ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలకు సేవలందిస్తున్నారు. సంచార వాహనాల దగ్గర ప్రాథమిక చికిత్స అందించి అత్యవసరమైతే 108 వాహనాల ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించే విధంగా అధికార యంత్రాంగం చర్యల చేపట్టింది.
విజయవాడ సింగ్ నగర్లో తగ్గుతున్న వరద - సహాయక చర్యలు వేగవంతం - Relief Work in Flood Affected Areas
నిత్యావసరాలు కూడా పంపిణీ : విజయవాడ విద్యాధరపురంలో వరద బాధితులకు పాలు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. స్థానిక వాలంటీర్‌తో పాటు పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ కానిస్టేబుల్‌ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు గత రెండ్రోజులుగా నిత్యావసరాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఉదయం నుంచి వర్షాలు పడుతున్న లెక్క చేయకుండా రేషన్ సరుకులు అందిస్తున్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన ప్రకాశం బ్యారేజ్ గేట్ల పనులు- రికార్డు టైమ్‌లో కౌంటర్ వెయిట్ల బిగింపు - PRAKASAM BARRAGE GATES WORKS