ETV Bharat / state

వర్షం పడితే వణుకే : బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఆ ఊరు ప్రజలు - Flood Affects in Telangana

Flood Affects in Telangana : ఊళ్లో ఉందామంటే వరద ఎప్పుడు ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. పునరావాస గ్రామానికి వెళ్దామంటే కనీస వసతులు లేక నివాసం ఉండలేని దుస్థితి. గత్యంతరం లేక భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది ఆ ముంపు గ్రామం. భారీవర్షాలకు నిండిన అసంపూర్తి జలాశయం ఆ ఒక్క గ్రామాన్నే కాదు. చుట్టుపక్కల ఊర్లనూ ఆందోళనకు గురిచేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి జలాశయం కింద ముంపు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Flood Affects in Jogulamba Gadwal District
Flood Affects in Jogulamba Gadwal District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 2:11 PM IST

Flood Affects in Jogulamba Gadwal District : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామం ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతోంది. ఇటీవలి భారీ వర్షాలకు వరద గ్రామాన్ని ముంచెత్తడంతో తక్షణం వారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 2006లో చిన్నోనిపల్లి జలాశయం నిర్మాణం మొదలుపెట్టారు. అందులో గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోంది. సాగు భూములు, ఇండ్లు సహా పునరావాసం కోసం అప్పట్లోనే డబ్బులు చెల్లించారు.

పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మౌలిక వసతుల పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. ఏళ్లుగా జలాశయ నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. దీంతో ఎవరి భూముల్లో వాళ్లు సాగు చేసుకుంటూ ముంపు గ్రామంలోనే ఉంటున్నారు. ఇటీవల వానలకు జలాశయంలోకి భారీఎత్తున వరద వచ్చి గ్రామాన్ని ముంచెత్తింది. ప్రస్తుతం జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు.

రెయిన్​ ఎఫెక్ట్​ - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వైరా జలాశయం - Flood Effect on Khammam District

ఏళ్లు గడిచినా జలాశయం పూర్తి కాకపోవడంతో గ్రామస్థుల ఆలోచన మారింది. అసలు తమ గ్రామం వద్ద రిజర్వాయరే వద్దని ఏళ్లుగా ఆందోళనలు, నిరసనలు, రిలే దీక్షలు చేశారు. జలాశయం వల్ల గద్వాల నియోజకవర్గానికి ఉపయోగం లేదని, నీటినిల్వ తప్ప ఆయకట్టు లేని రిజర్వాయర్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్​ ఆయకట్టు సాగునీరు కోసం జలాశయ నిర్మాణాన్ని గత ప్రభుత్వం కొనసాగించింది. చిన్నోనిపల్లి గ్రామస్థులు ఊరు ఖాళీ చేయకపోవడంతో భారీవర్షాలకు ముంపునకు గురికాక తప్పలేదు.

పునరావాస గ్రామానికి తరలి వెళుతున్న ప్రజలు : పునరావాసం కింద 2013లో గట్టు మండలం ఎర్రగుట్ట వద్ద 50 ఎకరాల స్థలం కేటాయించారు. రూ.27 కోట్లతో మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా రోడ్లు, మంచినీరు, విద్యుత్ సహా ఇతర పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రభుత్వ బడి పిల్లర్ల దశలోనే వదిలేశారు. డ్రైనేజీ పనులు చేసినా ప్రస్తుతం అక్కరకు రాకుండా పోయాయి. ప్రస్తుతం అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. అయినా ముంపునకు గురైన కుటుంబాలు, ఖాళీచేసి పునరావాస గ్రామానికి తరలివెళ్తున్నాయి.

వరదనీటిని మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ఆ నీటితో కింద ఉన్న బోయలగూడం, లింగంపురం గ్రామాల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికి జలాశయం పనులు 80శాతం పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న కట్ట వద్ద వరదనీరు పూర్తిగా నిండింది. ఆ కట్ట తెగితే దిగువన ఉన్న మూడు నాలుగు గ్రామాలకు ముంపు తప్పదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

చిన్నోనిపల్లి ముంపు నుంచి బయట పడాలంటే గ్రామాన్నంతా ఖాళీ చేయాలి. అందుకు అవసరమైన ఖర్చులు బాధిత కుటుంబాలకు అందించాలి. పునరావాస గ్రామంలో మౌలిక వసతులు యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సిన అవసరముంది.

ఖమ్మం జిల్లాలో ఇంకా జలదిగ్బంధంలో ఇళ్లు, పంటపొలాలు - Flood Effect In Khammam

వరద బాధితులకు అండగా కదిలొచ్చిన కాంగ్రెస్ నేతలు - 2 నెలల వేతనం విరాళంగా ప్రకటన - Congress Donates to Flood Victims

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.