First Indian Village Mana in Uttarakhand: చుట్టూ ఎత్తైన కొండలు, జలపాతాలు, మంచుతో కప్పబడిన ఈ ప్రాంతమే మనా. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చిట్టచివరన ఉంది. ఇండో- టిబెట్ సరిహద్దుల్లో సముద్ర మట్టానికి 10 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. సుమారు 13 వందల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. 'మనా' గ్రామాన్ని భారతదేశపు మొదటి గ్రామంగా పిలుస్తారు. 'మనా' విషయంలో చాలా గందరగోళం ఉండేది. ఇది భారదేశపు చిట్టచివరి గ్రామమని, కాదు కాదు మొట్టమొదటి గ్రామమని అంటుంటారు. అయితే ఇటీవలే దీన్ని భారతదేశపు తొలి గ్రామంగా గుర్తిస్తూ సరిహద్దు రోడ్ల సంస్థ సైన్ బోర్డును ఏర్పాటు చేసింది.
పురాణ ఇతిహాసాల్లో కూడా మనా గ్రామాన్ని ప్రస్తావించడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ గ్రామాన్ని మహాభారత కాలానికి సంబంధించినదిగా చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం మహాభారతం ఈ గ్రామంలోనే వేద వ్యాసుడు చెబుతుంటే గణేషుడు రాశారని చెబుతుంటారు. పాండవులు స్వర్గానికి ప్రయాణం చేసినప్పుడు 'మనా' గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు. ఈ ప్రాంతంలో సరస్వతి నదికి సమీపంలో ఉన్న రాతి వంతెనను 'భీమా పుల్' అని పిలుస్తారు. పాండవ సోదరుల్లో ఒకరైన భీముడు దీన్ని నిర్మించినట్లు ప్రచారం. హిందూ పురాణాల ప్రకారం ఈ గ్రామంలోనే మహాభారత రచన జరిగిందని చెబుతారు. గోడలపై దేవతామూర్తుల పెయింట్లు ఆకట్టుంటున్నాయి.
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? ఆమె ఎవరో మీకు తెలుసా? - indias first women wrestler hamida
మిగతా ప్రాంతాలతో పోల్చితే మనా గ్రామ ప్రజల జీవనం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బంగాళాదుంపలు అధికంగా పండిస్తారు. వీటితోనే వంటకాలు తయారు చేస్తారు. మనా గ్రామం ఉన్ని దుస్తులకు ప్రఖ్యాతిగాంచింది. గొర్రెల నుంచి సేకరించిన ఉన్నితో స్వెటర్లు, షాలువాలు, మఫ్లర్లు, క్యాపులు, తివాచీలు, చేతితో అల్లిన రంగురంగుల వస్త్రాలు తయారు చేస్తూ, వీటినే ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
బద్రీనాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో చార్‌ధాం యాత్రకు వెళ్లే పర్యాటకులంతా ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ మైమరిచిపోతారు. గత కొన్ని సంవత్సరాలుగా పర్యాటకులు తాకిడి కారణంగా గ్రామంలో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని పర్యాటకుల అభివృద్ధికి తగ్గట్టు ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.
"చార్‌ధాం యాత్రలో భాగంగా భారతదేశంలోని మొదటి గ్రామమైన మనాకు మేము వచ్చాము. ఇక్కడ పరిస్థితులు మాకు కొత్తగా కనిపించాయి. చేతితో అల్లిన స్వెటర్లు, షాలువాలు చాలా ప్రసిద్ధి. దానికోసమే మేము ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము". - పర్యాటకుడు
దేశంలోనే తొలి కేబుల్ రైల్వేబ్రిడ్జ్.. 120ఏళ్లు సూపర్ స్ట్రాంగ్.. గంటకు 100కి.మీ స్పీడ్‌తో జర్నీ