ETV Bharat / state

షార్ట్‌ సర్క్యూట్‌తో రెండు ఇండ్లు దగ్ధం - తప్పిన ప్రాణనష్టం

Fire Accident in Warangal District : వరంగల్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా చెరువుకొమ్ము తండాలో రెండు ఇండ్లు అగ్నికి అహుతయ్యాయి. ఈ ఘటనలో ఇండ్లలోని సామాన్లు సహా నిత్యవసర వస్తువులు కాలిపోయాయి. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Fire Accident in Warangal District
Fire Accident in Warangal District
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 1:44 PM IST

షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఇండ్లలో చేలరేగిన మంటలు

Fire Accident in Warangal District : రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వేసవి సమీపిస్తుండటంతో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. పౌరులు అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిదవుతుంటాయి. తాజాగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి.

Warangal Fire Accident Today : ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోగా ఆస్తి నష్టం వాటిల్లింది. ధరావత్ ధర్మ, విజ్య, శ్రీనివాస్ కుటంబ సభ్యులు ఇంట్లోకి మంటలు రావడం గమనించి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. చుట్టుపక్కలకు మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న గడ్డివాము సైతం మంటలో కాలి బూడిదైంది.

చుట్టు పక్కలా వారి సహాయంతో మంటలను (Fire Accident) ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా ఇంట్లోని సామాన్లు సహా నిత్యవసర వస్తువులు కాలిపోయాయని బాధితులు వాపోయారు. అధికారులు స్పందించి తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఏడుగురు దుర్మరణం- మరో ఏడుగురు సీరియస్​!

Burned Bike in Shadnagar : మరో ఘటనలో ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నుంచి ఓ వ్యక్తి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. సరిగ్గా భారత్ పెట్రోల్ పంపు వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన వాహన చోదకుడు ద్విచక్రవాహనంపై నుంచి దిగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

మరోవైపు అగ్నిప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదని, అందరూ అప్రమత్తమైతే వాటిని నివారించడం చాలా తేలికని అగ్నిమాపక శాఖ (Fire Department) అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో అగ్నిమాపక పరికరాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు ఆ పరికరాలు ప్రాథమికంగా ఉపయోగపడతాయని ఇలాంటి పరికరాలు ఉపయోగించేలా ప్రజలు ప్రత్యేక శ్రద్ద వహించాలని పేర్కొంటున్నారు.

భవనంలో మంటలు- 15మంది మృతి, మరో 44మందికి గాయాలు

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ అధికారులు వివరిస్తున్నారు. తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఆధునిక పరికరాలతో నగరాలు, పట్టణాల్లో జరిగే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. ప్రజల్లో కూడా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను చేపడుతున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

నాచారం పారిశ్రామిక వాడలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణనష్టం

రెస్టారెంట్​లో చెలరేగిన మంటలు- 45మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.