Tollywood Film Producers Meet AP Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు ఇవాళ భేటీ అయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్‌తో చర్చించారు. ఈ మేరకు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కల్యాణ్‌కు నివేదించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌తో పాటు అల్లు అరవింద్, అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బోగవల్లి ప్రసాద్, డి.వీ.వీ.దానయ్య , సుప్రియ, ఎన్.వీ.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీ.జీ.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలిపి గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్‌తో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు.
టికెట్ల రేట్లు చిన్న విషయం: పవన్ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ తరపున అభినందించినట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. అన్ని అసోసియేషన్లు కలసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామన్నారు. అదే సమయంలో సినిమా పరిశ్రమకు సంబంధించి సమస్యలపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. సినిమా పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయన్న అల్లు అరవింద్ సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది మాకు చాలా చిన్న విషయమన్నారు. సీఎం చంద్రబాబును కలిసినపుడు రిప్రజెంటేషన్ రూపంలో మా సమస్యలు తెలియజేస్తామని అల్లు అరవింద్ తెలిపారు.
"ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ తరపున అభినందించాము. అలానే సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరడం జరిగింది. అన్ని అసోసియేషన్లు కలసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తాము. అదే సమయంలో సినిమా పరిశ్రమకు సంబంధించి సమస్యలపై సీఎంతో చర్చిస్తాను. సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది మాకు చాలా చిన్న విషయం సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. సీఎం చంద్రబాబును కలిసినపుడు రిప్రజెంటేషన్ రూపంలో మా సమస్యలు తెలియజేస్తాము."- అల్లు అరవింద్, సినీ నిర్మాత
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2024
గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్… pic.twitter.com/PhxWR3qXAw
వైఎస్సార్సీపీ లెక్కలు తేల్చిన పవన్ - ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ - Sensation in AP Politics