ETV Bharat / state

హైదరాబాద్‌లో దారుణం - కుమార్తెపై మారుతండ్రి అత్యాచారం - Father Raped Daughter ameerpet

Father Raped Daughter in Hyderabad : తనను, తన పిల్లల్ని బాగా చూసుకుంటానని నమ్మించాడు. జీవితాంతం అండగా ఉంటానని మభ్యపెట్టాడు. అతని మాటలు నమ్మిన మహిళ సదరు వ్యక్తిని వివాహమాడింది. తీరా వావివరుసలు మరిచి కుమార్తెపైనే అత్యాచారానికి తెగబడ్డాడు ఓ మారుతండ్రి. సభ్యసమాజానికి తలవంపులు తెచ్చే ఈ దారుణం ఈ ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad Crime News
Father Raped Daughter in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 10:46 PM IST

Father Raped Daughter in Hyderabad : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మారు తండ్రి. ఈ ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చందానగర్ ఆర్టీసీ కాలనీకు చెందిన కృష్ణారావు, ఓ మహిళను 2013లో రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఎదిగిన కూతురు, కుమారుడు ఉన్నారు. నిన్ను, నీ బిడ్డల్ని బాగా చూసుకుంటానని సదరు మహిళను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. అతని మాటలను నమ్మిన మహిళ జీవితంలో తనకు ఓ తోడు కావాలనుకుని అతణ్ని పెళ్లాడింది.

ఫ్రెండ్​తో వెళ్లిన బాలికపై గ్యాంగ్​రేప్​- నిందితులకు 90ఏళ్ల జైలుశిక్ష

Hyderabad Crime News : గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. పడుచు ప్రాయంలో ఉన్న ఆమె కుమార్తెపై కన్నేశాడు ఆ కామాంధుడు. హాట్ స్టార్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాలు ఉన్నాయని, డైరెక్టర్‌ను ఓసారి కలువాలని కూతురుకు చెప్పాడు. ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం కుమార్తెకు ఫోన్ చేశాడు. సాయంత్రం ఆడిషన్స్ జరుగుతున్నాయని, అమీర్‌పేట్‌లోని ఓ లాడ్జీకి రావాలని తెలిపాడు.

ఇదంతా నమ్మిన యువతి అతనితో కలిసి వెళ్లింది. తీరా చూస్తే అక్కడ ఎవరు లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోదామని యువతి చెప్పగా, డైరెక్టర్ టీ తాగడానికి బయటకు వెళ్లాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. కాసేపట్లో వచ్చేస్తారని చెప్పిన అతను గది తలుపునకు గడియ బిగించాడు. యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లిన యువతి అక్కడి నుంచే డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మైనర్‌ కుమార్తెపై అత్యాచారం- కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష!

Telangana Crime News : అనంతరం ఫోన్ చేసి ఏడుస్తూ తల్లికి జరిగిన దారుణం చెప్పింది. నిర్ఘాంతపోయిన ఆ మహిళ వెంటనే దివ్యాంగుడైన కుమారుడితో కలిసి లాడ్జికి పరుగున వెళ్లారు. మారు తండ్రిని పక్కకు నెట్టి గడియ తెరిచిందామె. కుమార్తె పరిస్థితి చూసిన ఆ తల్లి మనస్సు తల్లడిల్లింది. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ మారుతండ్రికి దివ్యాంగ కుమారుడు దేహశుద్ది చేశాడు. కుమారుడిని కొట్టి.. అతని ప్లాస్టిక్ కాలును కృష్ణారావు విరగొట్టాడు. తనపై మహిళ, ఆమె కుమారుడు దాడి చేశారంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కృష్ణారావుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారంటూ అత్యాచారానికి పాల్పడ్డ కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళతో పాటు ఆమె కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దారుణం - సాయం చేస్తామని నమ్మించి యువతిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.