ETV Bharat / state

'పోలీసులు సరిగ్గా స్పందించలేదు అందుకే నేనే చంపేశా - ఆడపిల్ల తండ్రిగా నేను చేసింది న్యాయమే'

కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి హత్య - పోలీసులు సరిగా స్పందించపోవడంతోనే చేశానని వెల్లడి - ఆడపిల్ల తండ్రిగా తాను చేసింది న్యాయమే నంటూ వీడియో సందేశం

Father Killed a Person Who Misbehaved with His Daughter
Father Killed a Person Who Misbehaved with His Daughter (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Father Killed Person Who Misbehaved with His Daughter : తమకు అన్యాయం జరిగిదంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో సరిగ్గా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో, ఒక్కోసారి ఓర్చుకోలేక ఎలా ప్రవర్తిస్తారో తెలియజేసే ఉదంతం ఇది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందిచకపోవడంతో ఆవేదనకు గురైన తండ్రి కువైట్‌ నుంచి వచ్చి అతడిని హతమార్చాడు. తిరిగి కువైట్‌ వెళ్లిపోయిన అతడు బుధవారం వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన ఓ కుటుంబం కువైట్​లో ఉంటున్నారు. దీంతో వారి కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు ఇంటి దగ్గర ఉంచారు. ఇటీవల ఓ వ్యక్తి మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లికి ఫోన్​లో చేసి చెప్పగా, ఆమె వెంటనే చెల్లెకి ఫోన్​ చేసి అడగ్గా సరిగ్గా స్పందించలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తండ్రి కువైట్​ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

అద్దెకు దిగుతామంటూ సొమ్ముపై కన్నేసి - ఆపై వృద్ధ దంపతులను హత్యచేసి!

ఆవేదనను తట్టుకోలేక : ఈ క్రమంలో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పిలిపించి మందలించి వదిలేశారు. అనంతరం బాలిక తల్లి ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని అనుకున్నాడు. తన బిడ్డ పట్ల అలా ప్రవర్తించిన వ్యక్తిని వదిలేది లేదనుకున్నాడు. బాలిక తండ్రి కువైట్‌ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నింద్రిస్తున్న అతడిని ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్‌ వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని వివరిస్తూ బాలిక తండ్రి బుధవారం సామాజిక మాధ్యమాల్లో వీడియోని పోస్ట్‌ చేశారు. ఆడపిల్ల తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. చట్ట ప్రకారం తమకు న్యాయం జరగనందుకు హత్య చేశానని పేర్కొన్నారు.

ప్రేమించలేదని దారుణం - ఇంటర్ బాలికను చంపిన బాలుడు

'ఎక్కడికి వెళ్లావు' అని ప్రశ్నించిన భర్త - వస్త్రంతో గొంతు బిగించి, దిండుతో చంపిన భార్య

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.