Farmers on Maize in Ankapur : దేశవ్యాప్తంగా అంకాపూర్ మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రైతులే సొంతంగా దీనిని ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయలకు పేరుగాంచిన అంకాపూర్ మార్కెట్‌లో వానాకాలం వచ్చిందంటే మక్కబుట్టల వ్యాపారం జోరుగా జరుగుతుంది. అయితే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడంతో పచ్చి మక్క బుట్టలకు డిమాండ్ పెరిగింది. అంకాపూర్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, చంద్రాపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, ఏలూరు తదితర ప్రాంతాలకు మక్క బుట్టలు సరఫరా అవుతున్నాయి.
రైతులతో వ్యాపారుల ఒప్పందాలు : ఒక్కో సీజన్‌లో సుమారు 40 కోట్లకుపైగా వ్యాపారం అంకాపూర్ మార్కెట్ వేదికగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో 15 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. మక్క కంకులతో ఉన్న ఒక ఆటో లోడ్‌కు రూ. 5 వేల నుంచి 7 వేలు పలుకుతోంది. మంచి నాణ్యత ఉంటే ఆటోకు 8 వేల నుంచి 10 వేలు ధర ఉంటోంది. రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్న వ్యాపారులు, ఎకరానికి రూ. 90 వేల నుంచి లక్ష వరకు చెల్లించి పంట పొలాల నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
'పచ్చి మక్క బుట్ట ఎకరం వేశాం. ఈసారి రూ.80 వేలు లాభం వచ్చింది. గత సంవత్సరం కన్నా డబుల్ వచ్చింది. మక్క బుట్టలను ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా తీసుకెళ్తారు. గతేడాది కంటే ఈసారి గిట్టుబాటు ధర మంచిగా పలుకుతోంది. గత సంవత్సరం రూ.4 వేల ధర ఉంటే ప్రస్తుతం రూ.8 నుంచి 10 వేలు పలుకుతోంది' - రైతులు
ఎకరానికి రూ.50 నుంచి 70 వేల ఆదాయం : దీని వల్ల మార్కెట్‌కు తరలించే ఖర్చులు ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. పెట్టుబడిపోనూ ఎకరానికి రూ. 50 వేల నుంచి 70 వేల వరకు ఆదాయం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంకాపూర్ మార్కెట్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. పచ్చి మక్క బుట్టలు కాల్చి అమ్మడం, మక్క వడలు చేసి విక్రయించడం ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. మరో రెండు నెలలు ధర ఇలాగే ఉంటే మరింత ఆదాయం వస్తుందని మొక్కజొన్న రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'పచ్చి మక్క బుట్ట మొక్కజొన్న ఆర్మూర్ ప్రాంతంలోనే అత్యధికంగా పండిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పచ్చి మక్క బుట్టలకు సరైన మద్దుతు ధర లేదు. కానీ ఈ సంవత్సరం రైతు ఆశించిన దాని కంటే అదనంగానే ఆదాయం వస్తోంది'-రైతులు
ankapur desi chicken అంకాపూర్ నాటుకోడి కూర, అమెరికా చేరి
మొక్కజొన్న కంకులకు ఏకైక మార్కెట్.. సీజన్‌లో రూ.50 కోట్లకు పైగా వ్యాపారం