ETV Bharat / state

ముఖం చాటేసిన వరుణుడు - ఆందోళనలో రైతులు - No Rainfall in Anantapur - NO RAINFALL IN ANANTAPUR

Farmers Suffers No Rainfall Conditions in Anantapur District : రాష్ట్రంలోని పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

no_rainfall
no_rainfall (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 9:11 AM IST

Updated : Jul 31, 2024, 12:03 PM IST

Farmers Suffers No Rainfall Conditions in Anantapur District : ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు 5 రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దట్టంగా మేఘాలు వస్తున్నా, వర్షం మాత్రం రావడం లేదని రైతులు బాధపడుతున్నారు. ఇప్పటికే సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని దిగులు చెందుతున్నారు.

వరుణుడి అలక : ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు. సుమారు 40 రోజులుగా చినుకు జాడ లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో తుంగభద్ర జలాశయం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీటిని వరినాట్లకు వినియోగించరాదని, తొలుత ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాల కోసం జలాశయాలు నింపనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.

రైతులకు మొండి చెయ్యి చూపించిన వ్యాపారులు - రూ.3.40 కోట్లు బకాయి - FARMERS PROTEST FOR CROP CASH

వర్షాలు లేకపోవడంతో రైతుల దిగాలు : ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 8 లక్షల 56 వేల హెక్టార్లు. ఇప్పటి వరకు కేవలం లక్ష హెక్టార్లు మాత్రమే రైతులు సాగుచేయగలిగారు. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 31 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు విత్తనం వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా వేరుశెనగ సాగు చేస్తుండగా, ఈసారి కేవలం 26 శాతం మాత్రమే సాగు చేశారు. జూన్‌లో కొంతమేర జల్లులు కురిసినా జులైలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. 61 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, సత్యసాయి జిల్లాలో 41 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.

నాసిరకంగా టైగర్ రొయ్య సీడ్‌- నిండా మునుగుతున్న ఆక్వా రైతులు - Aqua Farmers Facing Problems

"మేము ఇప్పుడు వర్షాధారంగా వేరుశనగ, కంది, ఉలవ, రాగులు పంటలు పెట్టాం. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. బోరు సౌకర్యం లేకపోవడంతో వర్షంపై ఆధారపడి పండిస్తున్నాం. ఇప్పుడికైనా ప్రభుత్వం స్పందించి రైతుల స్థితిగతులను ఆలోచించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం" -రైతులు, ఉమ్మడి అనంతపురం వాసులు

ప్రభుత్వమే ఆదుకోవాలి : వేరుశెనగ పంట సాగుకు ఆగస్టు 15 వరకు సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లోగా వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.

కాల్వలను పట్టించుకోని గత ప్రభుత్వం- పంట నీట మునగడంతో అన్నదాతల ఆవేదన - Farmers Lost Crops

Last Updated : Jul 31, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.