ETV Bharat / state

రోడ్డెక్కిన తెలంగాణ రైతాంగం - సాగుకు నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ - Farmers Strike for Water

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 4:24 PM IST

Farmers Protest for Water in Telangana : సాగునీటి కోసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతులు రోడ్డెక్కారు. సాగునీటిని విడుదల చేయాలంటూ జాతీయ రహాదార్లపై బైఠాయించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో నీటి సప్లై ఆపడం సరికాదని, ఎండిపోతే తీవ్రంగా నష్టపోతామంటూ వాపోయారు.

Farmers Strike At Karimnagar
Farmers Protest for Water in Telangana

Farmers Protest for Water in Telangana : రాష్ట్రంలో సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంట సాగుకు నీరులేక నష్టపోతున్నామంటూ రోడ్డెక్కారు. తాజాగా కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో సాగునీటి కోసం రైతులు ఆందోళన చేశారు. ఎస్సారెస్పీ (SRPS Project) వరద కాలువలోకి నీటిని విడుదల చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కురిక్యాల, రంగరావుపల్లి, తాడిజెర్రి, విలాసాగర్ గ్రామాల రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన విరమించారు.

అప్రకటిత కరెంట్‌ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

"ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేస్తున్నాం. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాం. ఒక్క పదిరోజులు సాగుకు నీరు విడుదల చేస్తే పంట చేతికి వస్తుంది. ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలి." - రైతులు

Farmers Strike At Karimnagar : మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథనిలో పోచమ్మవాడ పరిసర పొలాల రైతులు ఆందోళనకు దిగారు. మంథని గోదావరిఖని ప్రధాన రహదారిపై బైఠాయించి ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. మండలంలోని కన్నాల వాగు నుంచి నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బొక్కలవాగు ద్వారా వాగులోకి వస్తున్న నీటిని, ఎగువన ఉన్న కొంతమంది రైతులు మోటార్లు పెట్టడంతో కింద సాగుచేస్తున్న పొలాలకు నీరందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ, వేంపాడు ప్రాజెక్టుల (Water Problem in Telangana) కింద దాదాపు 3500 ఎకరాల భూమి సాగవుతుందని, ఈ సమయంలో నీటి సప్లై ఆపేస్తే పూర్తిగా నష్టపోతామని వాపోయారు.

Millers frauds in paddy procurement : తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ.. తరుక్కుపోతున్న రైతు గుండె

Water Crisis In Telangana : ధర్నా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కాలువకు పెట్టిన మోటార్లు తొలగించి రెండు రోజుల్లో సాగునీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అన్నదాతలు ధర్నా (Farmers Strike) విరమించారు. సుమారు గంటపాటు రైతులు రాస్తారోకో చేయడంతో మంథని గోదావరిఖని ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

"ఒక 25 రోజులు నీరు ఇస్తే పొలాలు మొత్తం పండుతాయి. ఆరు గ్రామాలకు నీరు అందించకపోతే పంటలు అన్ని ఎండిపోతాయి. అప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. 70 శాతం మంది రైతులు కౌలు చేసుకునే వారే ఉన్నారు. పంట చివరి దశకు వచ్చే సమయానికి నీళ్లు అసలు రావడం లేదు. ఎగువన ప్రాంతాల్లో మోటార్లు నడవడంతో కింద ఉన్న పొలాలకు నీరు రావడం లేదు. దయచేసి ప్రభుత్వం సాగుకు నీరు విడుదల చేయాలి." - బాధిత రైతులు

రోడ్డెక్కిన తెలంగాణ రైతాంగం సాగుకు నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్

కరెంట్​ కోతలు.. రైతన్నకు తప్పని వెతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.