ETV Bharat / state

బావులతోనే బాగుపడ్డాం- అన్నదాతలకు అక్షయపాత్రగా మారిన ఊటబావులు - Farmers Overcome Water Shortage

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 7:59 PM IST

Updated : Aug 24, 2024, 10:28 PM IST

Digging Wells in Nalgonda : గతేడాది వర్షాభావంతో నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయి రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొన్నారు. వానాకాలంలోనూ సరైన వర్షాలు పడక భూగర్భజలాలు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. ఇలాంటి కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం పొందేందుకు కొందరు రైతులు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

Water Sources in Nalgonda
Digging Wells in Nalgonda (ETV Bharat)

Water Sources in Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతేడాది వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోయాయి. నాగార్జునసాగర్‌ జలాశయంలోనూ నీరు దగ్గడంతో భూగర్భజలాలు అడుగంటాయి. వేసిన పంటలను కాపాడుకునేందుకు ఒక్కొక్కరు 10 నుంచి 15 బోర్లు వేయించినా, చుక్కనీరు రాక రైతులు లక్షల్లో నష్టపోయారు. వానాకాలంలోనూ సరైన వర్షాలు పడలేదు.

జల నిపుణుల సంతృప్తి : ఇలాంటి కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం కోసం నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామంలోని సన్న, చిన్నకారు రైతులు కలిసి ఆరేళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో బావులు తవ్వించుకున్నారు. ప్రస్తుతం వీటిలో నీరు పుష్కలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ జల నిపుణుల బృంద సభ్యులు ఈ బావులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చుకున్నారంటూ అభినందించారు.

గతంలో సాగు చేసేందుకు ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకుండాపోయిందని రైతులు చెబుతున్నారు. నీటివసతి లేక తోటలు పెట్టుకుంటే, అవి కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆరేళ్ల క్రితం ఉపాధిహామీలో బావిని తవ్వించుకున్నామని, ప్రస్తుతం తమకు నీటి కష్టాలు దూరమయ్యాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామసభలో ఆమోదం : గతంలో 15 లక్షలు ఖర్చు చేసి 8 బావులు తవ్వించామని, అన్ని బావుల్లో ఐదారేళ్ల నుంచి నీరు పుష్కలంగా ఉంటుందని ఏపీవో రమణయ్య అన్నారు. సన్న, చిన్నకారు రైతులు ఉపాధిహామీలో ఈ బావులు తవ్వుకునే అవకాశం ఉందన్నారు. రైతులు దరఖాస్తులు చేసుకుంటే గ్రామసభ ఆమోదంతో బావులు మంజూరు చేస్తామన్నారు. కరవు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ చెరువులు, బావులు, కుంటలను నీటితో నింపుకోవాలని రైతులు చెబుతున్నారు.

"గతంలో సాగు చేసేందుకు ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకుండాపోయింది. మా స్నేహితుడి సలహాతో వ్యవసాయశాఖ అధికారులను కలిశాము. ఆరేళ్ల క్రితం ఉపాధిహామీలో బావిని తవ్వించుకున్నాము. ప్రస్తుతం మాకు నీటి కష్టాలు దూరమయ్యాయి. అన్ని పంటలు సాగు చేసుకుంటున్నాము". - రైతు, చందుపట్ల

"సన్న, చిన్నకారు రైతులు ఉపాధిహామీలో ఈ బావులు తవ్వుకునే అవకాశం ఉంది. రైతులు దరఖాస్తులు చేసుకుంటే గ్రామసభ ఆమోదంతో బావులు మంజూరు చేస్తాము. కరవు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ చెరువులు, బావులు, కుంటలను నీటితో నింపుకోవాలి". - రమణయ్య, ఏపీవో

రుణమాఫీ కాలేదా అయితే అర్జీ ఇవ్వండి - ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే? - Farmers on Loan Waiver Issues

'పంటలు ఎండుతున్నాయి - సాగు నీరివ్వండి సారూ' - Farmers Facing Problems In Nalgonda

Last Updated : Aug 24, 2024, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.