ETV Bharat / offbeat

బెస్ట్ రిలాక్సేషన్ టూర్ - కేరళకు IRCTC సూపర్ ప్యాకేజీ - గాడ్స్​ ఓన్ కంట్రీలో 7 రోజులు! - IRCTC Cultural Kerala Tour Package

IRCTC Kerala Tour Package : ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి.. బెస్ట్​ టూరిస్ట్​ ప్లేస్ కేరళ. మరి మీరు కూడా కేరళను విజిట్​ చేయాలనుకుంటున్నారా? అయితే.. మీకోసం ఐఆర్​సీటీసీ అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..​

IRCTC Kerala Tour Package
IRCTC Kerala Tour Package (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 3:48 PM IST

IRCTC Cultural Kerala Tour Package: ప్రశాంతమైన హౌస్‌బోట్ రైడ్‌, హిల్ స్టేషన్‌లు, మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలు.. ఇలా ఒక్కటేమిటి కేరళలో చూడాల్సినవి చాలానే ఉన్నాయి. అయితే ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకుంటున్న వారి కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​. కేరళలోని నాలుగు ప్రముఖ ప్రాంతాలతో పాటు మరెన్నో సుందరమైన టూరిస్ట్ ప్రదేశాలను కవర్ చేస్తూ ప్యాకేజీ తీసుకొచ్చింది. బిజీబిజీ జీవితానికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి, లైఫ్​ను ఎంజాయ్​ చేసేందుకు ఈ టూర్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ టూర్​ ఎన్ని రోజులు ఉంటుంది? ఏఏ ప్రదేశాలు కవర్​ చేయొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

కల్చరల్​ కేరళ (Cultural Kerala) పేరుతో ఐఆర్​సీటీసీ ఈ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఈ టూర్​లో అలెప్పి, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం ప్రాంతాలను కవర్ చేస్తారు. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ప్రయాణం ఉంటుంది. ఈ ప్యాకేజీ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..

మొదటి రోజు ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అయ్యి కొచ్చి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తయిన తర్వాత పర్యాటకులను పికప్ చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు. లంచ్​ చేసిన తర్వాత యూదుల ప్రార్థనా మందిరం, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్‌లను కవర్ చేస్తూ.. ఫోర్ట్ కొచ్చిని సందర్శిస్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్‌ ఉంటుంది. రాత్రికి కొచ్చిలో బస చేస్తారు.

రెండో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ అనంతరం మున్నార్​కి బయలుదేరతారు. మార్గమధ్యలో చీయపారా జలపాతాన్ని సందర్శిస్తారు. మున్నార్ చేరుకుని హోటల్​లో చెక్ ఇన్ అవుతారు. అనంతరం టీ మ్యూజియాన్ని సందర్శిస్తారు. రాత్రికి మున్నార్‌లోనే బస చేస్తారు.

మూడో రోజు మున్నార్​లోని పర్యాటక ప్రాంతాలైనా మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్లా డ్యామ్ సరస్సు విజిట్​ చేస్తారు. ఆ రాత్రి కూడా మున్నార్​లోనే బస చేయాలి.

IRCTC అద్దిరిపోయే టూర్ - మధుర మీనాక్షి ఆలయంతోపాటు మరెన్నో ప్రదేశాల సందర్శన!

నాలుగో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి తేక్కడికి బయలుదేరి వెళ్తారు. మార్గమధ్యలో స్పైస్ ప్లాంటేషన్లను సందర్శిస్తారు. తేక్కడి హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ​ రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఐదో రోజు.. హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత అలెప్పి/కుమరకోమ్​కి బయలుదేరతారు. అలెప్పిలో సొంత ఖర్చుతో బ్యాక్ వాటర్స్ రైడ్ చేయవచ్చు. రాత్రికి అలెప్పి/కుమరకోమ్‌లో బస చేస్తారు.

ఆరో రోజు బ్రేక్ ఫాస్ట్ అనంతరం చడియమంగళంకి బయలుదేరతారు. జటాయు ఎర్త్ సెంటర్‌ని సందర్శిస్తారు. అనంతరం త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి త్రివేండ్రంలో బస చేస్తారు.

ఏడో రోజు ఉదయాన్నే శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. నేపియర్ మ్యూజియం, అజిమల శివ విగ్రహాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.53,400, ట్విన్​ షేరింగ్​కు 37,000, ట్రిపుల్​ షేరింగ్​కు 34,850 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 30,600, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 25,550గా నిర్ణయించారు.
  • 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.17,700గా నిర్ణయించారు.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్స్​(హైదరాబాద్​- కొచ్చి/ త్రివేండ్రం - హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 6 బ్రేక్​ఫాస్ట్​లు, 6 డిన్నర్​లు
  • సైట్​ సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి బస్సు ఉంటుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 14వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.​

అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.