ETV Bharat / state

24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లు సొమ్ములు జమ - రైతుల్లో సంతోషం - FARMERS HAPPY ON GRAIN PAYMENTS

రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేసి సొమ్ము జమ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

farmers_happy_on_grain_payments
farmers_happy_on_grain_payments (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Farmers Happy over Grain Payments in AP: ధాన్యం సొమ్ములు చెల్లింపులపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములు ఖాతాలో పడతాయని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం తూ.చ తప్పకుండా అమలవుతోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో ధాన్యం డబ్బులు కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల నుంచి సొమ్ము జమ చేయడం వరకూ పక్కాగా అమలు చేస్తుండంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లాలో 6,985 మంది రైతుల నుంచి ఇప్పటివరకు 46,310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యం విలువ రూ.103.78 కోట్లు వరకు ఉంటుంది. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.100.63 కోట్లు చెల్లించగా ఇంకా కేవలం రూ.3.15 కోట్లు మాత్రమే చెల్లించాలి. అంటే ఎంత వేగంగా రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుంది అర్థమవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో 24 గంటల్లో సొమ్ములు జమ అయినట్లు ఫోన్లకు మెస్సెజ్​లు వస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లాలో ఇదే సమయానికి గతేడాది కేవలం 13000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ చేశారు. ప్రస్తుతం 3 రెట్లు ఎక్కువగా సేకరణ జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే రూ.674 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే రూ.637 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఓవైపు ఏ క్షణాన వర్షాలు వస్తాయో తెలియని పరిస్థితిలో ఆందోళన చెందుతున్న తమకు ప్రభుత్వం వేగంగా, నేరుగా కొనుగోలు చేయడం సంతృప్తినిచ్చిందని రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 21 రోజుల్లో చెల్లిస్తామని గడువు పెట్టింది. కానీ ఆ గడువు 60 రోజులు 90 రోజుల వరకు కొనసాగింది. ధాన్యం విక్రయించిన తర్వాత 90 రోజులకు కూడా సొమ్ములు అందేవి కావు.

సమస్యగా మారిన తేమ: ఇలా ఆలస్యం అవుతున్నాయనే కారణంగా వెంటనే సొమ్ములు ఇచ్చే దళారులకు తక్కువ ధరకే విక్రయించారు. వారు ప్రభుత్వానికి అమ్మేవారు. సొమ్ముల జాప్యంతో దళారులకే రైతులు విక్రయించారు. ఈ ఏడాది ఈ సమస్య తప్పింది కాని తేమ సమస్యగా మారింది. ధాన్యంలో తేమ 25 శాతం వరకు ఉంటోంది. రెండుసార్లు తుపాను ప్రభావంతో ఎండలు తక్కువగా ఉన్నాయి. తేమ శాతాన్ని వ్యవసాయ శాఖ సిబ్బందే క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 17 శాతం కంటే తక్కువున్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేశాక 24 నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు సొమ్ములు జమవుతున్నాయి. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది.

'భలే మంచి బేరం' - హైదరాబాద్​లో సొంతింటి కల నెరవేర్చుకోండిలా!

ప్రయాణం కష్టమే కానీ కళ్లు చెదిరే అందాలు - ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.