ETV Bharat / state

ఓవైపు అప్పులు - మరోవైపు కుమార్తె కాపురంలో సమస్యలు - పురుగు మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం - Family Members Suicide Attempt

Family Members Suicide Attempt due to Money Problems in Tenali : ఒక వైపు అప్పుల బాధ, మరో వైపు కుమార్తె సంసారంలో కష్టాలు. ఈ రెండింటితో సతమతమైన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్‌రావు భార్య నాగమణి మృతి చెందారు. కుమార్తె హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Family Members Suicide Attempt in Money Problems at Tenali

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 2:12 PM IST

Family Members Suicide Attempt due to Money Problems in Tenali : ఓ వైపు అప్పుల బాధ, మరో వైపు కుమార్తెకు కట్నం తీసుకురావాలని అత్తమామల వేధింపులు. ఈ రెండింటితో సతమతమైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి చేయగా బంధువులు వారిని గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్‌రావు భార్య నాగమణి మృతి చెందారు. కుమార్తె హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వై​సీపీ కౌన్సిలర్​ వేధిస్తున్నారని అటెండర్​ ఆత్మహత్యాయత్నం - సెల్ఫీ వీడియో

Family suicide Attempt at Guntur District: బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని నాజర్‌పేటకు చెందిన శివశంకర్‌రావు, భార్య నాగమణి, కుమార్తె హరిక ముగ్గురు అప్పులు తీర్చలేక ఆత్మహత్యయత్యానికి పాల్పడ్డారు. పాల వ్యాపారం చేస్తున్న శివశంకర్‌రావు తన బిజినెస్​ సరిగా లేకపోవడంతో రైల్యే స్టేషన్ వద్ద టీ స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. కుమార్తె పెళ్లి కోసమని డబ్బులు అప్పు తెచ్చిన అతడు తీర్చడానికి నానా అవస్థలు పడినట్లు పేర్కొన్నాడు. కట్నం కోసమని అల్లుడు, అత్తామామలు తనని వేధిస్తున్నట్లు కుమార్తె తండ్రితో చెప్పినట్లు అతడు వివరించాడు. వివాహానికి చేసిన అప్పులు తీరక, మరో వైపు హరికను అత్తింటి వారు వేధించడం తనని మరింత మానసిక స్థితికి గురి చేసినట్లు పేర్కొన్నాడు.

ప్రేమ పేరుతో యువతి మోసం: యువకుడి ఆత్మహత్యాయత్నం

గత కొన్ని రోజులుగా మరింత ఎక్కువగా అప్పు ఇచ్చినవారు ఒత్తిడి చేయటం, కుమార్తెకు అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ అవ్వటంతో పురుగులు మందు తాగాం. వివాహం చేసుకున్న తర్వాత అధిక కట్నం తెమ్మంటూ అల్లుడు, అత్తమామలు హారికను వేధింపులకు గురి చేస్తూ, చిత్రహింసలు పెట్టారు. పుట్టింట్లో జరిగే ఎటువంటి కార్యక్రమాలకు సైతం తన కుమార్తెను పంపించకుండా మానసికంగా హింసిస్తున్నారు. - శివశంకర్​ రావు

దంపతుల మధ్య వివాదంతో ఆత్మహత్యయత్నం- చిన్నారి మృతి

వీటితో పాటు కుమార్తె వివాహానికి చేసిన అప్పులు పెరిగిపోవటంతో అప్పు ఇచ్చిన వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని అందువల్ల తీవ్ర మనస్తాపానికి గురై కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు శంకర్​రావు పేర్కొన్నాడు. సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లేక చావు ఒకటే మార్గమని పురుగుల మందు తాగినట్లు అతడు తెలిపాడు. కట్నం కోసం తన కుమార్తెను అత్తింటివారు వేధిస్తున్నారనే విషయాన్ని పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.

పత్తికొండలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలు - ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.