
Urvasi Bar And Restaurant License Cancelled by Excise Police : హైదరాబాద్‌లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్‌ను బేగంపేట ఎక్సైజ్ పోలీసులు మూసివేయించారు. ఇటీవల బార్‌లో అశ్లీల నృత్యాలు చేస్తుండగా 30 మంది అమ్మాయిలతో పాటు 60 మంది కస్టమర్లని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా బార్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి లైసెన్సును రద్దు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బార్స్, రెస్టారెెంట్లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Urvasi Bar And Restaurant Case : స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ నెల 3వ తేదీన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బార్‌పై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బార్ నిర్వాహకులు, మేనేజర్లతో సహా మొత్తం 107 మందిని అరెస్టు చేశారు. వీరిలో 30 మంది యువతులు, కాగా మరో 60 మంది కస్టమర్లు, ఇంకో 17 మంది నిర్వాహకులున్నారు. కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు బేగంపేట పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్‌లో అశ్లీల కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను నిర్వహించడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు లేఖ రాశారు. దీంతో ఊర్వశి బార్‌ను మూసివేసి లైసెన్సును రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు.
Illegal Bars And Restaurants in Hyderabad : ఇటీవల బార్ అండ్ రెస్టారెెంట్, స్పా సెంటర్ల పేరిట వ్యాపారాలు మొదలెట్టి అమ్మాయిలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు. డబ్బుపై మక్కువతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా బార్లు, రెస్టారెంట్లు, స్పా సెంటర్లు వంటి వ్యాపారాలను నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు, నిరుద్యోగులకు డబ్బు ఆశ చూపించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీటిపై పోలీసులు కన్నేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో తనిఖీలను ముమ్మరం చేశారు. లైసెన్సు లేకుండా, అమ్మాయిలను ఇలాంటి వ్యాపారాలకు ఉపయోగించినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, లైసెన్సు రద్దు చేస్తున్నారు.
Massage Center Seized in Banjara Hills : ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. డబ్బు ఎర చూపి వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. స్పా సెంటర్‌పై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, 18 మంది విటులను, 10 మంది యువతలను ఆదుపులోకి తీసుకుని. కేసు నమోదు చేశారు.
live video: బార్‌లో స్నేహితుడిపై దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు
Police raids On Spa : బంజారాహిల్స్‌లో స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి