Excise Officer Arrest 3 Members for Selling Liquor Illegally Outside in West Godavari District : రాష్ట్రంలో మద్యం విధానం మారగానే వ్యాపారులు చెలరేగిపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు సైతం మద్యం అమ్మకాలతో దండుకుంటున్నారు. తణుకు సంత మార్కెట్ ఏరియాలో బహిరంగ మద్యం విక్రయం సంచలనమైంది. మార్కెట్లను రెండు చోట్ల ముగ్గురు వ్యక్తులు కలిసి మద్యం అమ్మడం ప్రారంభించారు. మద్యం అమ్ముతున్న విషయం పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు తెలియడంతో దాడులు చేశారు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 8 వేల రూపాయలు విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
దాడుల సమయంలో పరారైన మద్యం విక్రయదారులను ఫొటోల సహకారంతో పట్టుకుని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి మాట్లాడుతూ సంత మార్కెట్లో మద్యం అమ్ముతున్న షేక్ మున్నా, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్య అనే ముగ్గురిని అరెస్ట్ అరెస్టు చేసి వారి నుంచి 60మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రెండు కేసులు నమోదు చేశామన్నారు. బెల్టు దుకాణాలకు అనుమతి లేదని, అలా బహిరంగంగా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏపీలో మద్యం నాణ్యతపై ఆరా! - రాష్ట్ర వ్యాప్తంగా డిస్టిలరీల్లో సీఐడీ తనిఖీలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు చుట్టుపక్కల బెల్టు దుకాణదారులు బరి తెగిస్తున్నారు. నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడం వల్ల పలు గ్రామాల్లో దుకాణాలు లేకపోవడాన్ని కొందరు అదనుగా తీసుకున్నారు. ఈ క్రమంలో పాతవూరు, సంతమార్కెట్, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో సంత మార్కెట్ వద్ద మద్యం అమ్మకాలు చేస్తున్న వైనాన్ని ఆదివారం ఓ వ్యక్తి ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో మద్యం విక్రయించే వ్యక్తి జారుకున్న సంగతి తెలిసిందే. ఎక్సైజ్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకునేసరికి ఇంటికి తాళం వేసి ఉండగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
"లైసెన్సులు మాకిచ్చి పోండి - ప్రతి నెలా ముడుపులివ్వాల్సిందే"- మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు