ETV Bharat / state

టానిక్‌ మద్యం దుకాణం కేసు - ప్రభుత్వ ఖజానాకు రూ.200 కోట్ల గండి - TONIQUE CASE Interim Report

author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 7:06 AM IST

Excise Dept Interim Report On Tonique Liquor Scam
Excise Dept Interim Report On Tonique Liquor Scam

Excise Dept Interim Report On Tonique Liquor Scam : టానిక్‌ మద్యం దుకాణానికి ఆయాచితంగా లబ్ధి చేకూర్చేందుకు గత సర్కార్ బహిరంగంగానే తోడ్పాటు అందించినట్లు తెలుస్తోంది. ఎలైట్‌ మద్యం దుకాణాల ఏర్పాటుకు ఇచ్చిన ఎలైట్‌ రూల్స్‌-2016 ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.200 కోట్లు గండిపడినట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన మధ్యంతర నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. అధికారుల తనిఖీల్లో యాభై కోట్లకుపైగా విలువైన లక్షన్నర బాటిళ్లు ఖరీదైన మద్యం పట్టుబడింది. ఈ విషయంలో మరింత లోతైన అధ్యయనం చేయాలని ఆబ్కారీ శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో టానిక్‌ మద్యం దుకాణానికి ఆయాచిత లబ్ధి

Tonique Liquor Stores Case Interim Report to Telangana Govt : రాష్ట్రంలో మద్యం విధానానికి పూర్తిగా భిన్నంగా టానిక్‌ మద్యం దుకాణం ఏర్పాటుకు గత ప్రభుత్వం ఎలైట్‌ రూల్స్‌-2016 పేరున జీవో 271 ఇచ్చింది. వాస్తవానికి తెలంగాణలో ఎలైట్‌ మద్యం దుకాణాలు ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ జీవో, కేవలం టానిక్‌ మద్యం దుకాణదారుడికి మాత్రమే ఉపయోగపడింది. అతనే మరో తొమ్మిది మద్యం దుకాణాలను తన ఆధీనంలోకి తీసుకొని నడిపించాడు.

Tax Evasion Tonique Liquor Stores : 2016-17 నుంచి ఇప్పటి వరకు టానిక్ మద్యం దుకాణం ద్వారా వందల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు వచ్చిన సమాచారంతో ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులతో కూడిన పది ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ దుకాణం ఒక్కటే గడిచిన తొమ్మిది సంవత్సరాలల్లో దాదాపు రూ.650 కోట్ల విలువైన లిక్కర్‌ను విక్రయించినట్లు గుర్తించారు. మిగిలిన తొమ్మిది మద్యం దుకాణాలు కలిసి మరో రూ.880 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం పది దుకాణాల ద్వారా గడిచిన 9 సంవత్సరాలల్లో రూ.1550 కోట్లకుపైగా విలువైన లిక్కర్‌ అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇందులో ఆల్కాలిక్‌ కాకుండా నాన్‌ ఆల్కాలిక్‌ కూడా మరో రూ.50 కోట్లకుపైగా విలువైన సరుకు అమ్మకాలు చేసినట్లు, ఆబ్కారీ శాఖ అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

టానిక్‌ మద్యం దుకాణం ఏర్పాటు జీవోలో మతలబుపై ప్రభుత్వం ఫోకస్! - Tonique LIQUOR STORES CASE

రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి : దాదాపు రూ.50 కోట్ల విలువైన లక్షా యాభైవేల ఖరీదైన మద్యం బాటిళ్లను తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ అధికారుల బృందం వెల్లడించింది. నౌకర్‌ నామా ఫీజు, ఇన్‌క్లూజిన్‌ ఫీజులు ఎగవేత ద్వారా రూ.1.25 కోట్లు, పది మద్యం దుకాణాల్లో అనధికారిక సరుకు విక్రయాలు ద్వారా రూ.51 కోట్ల వరకు సర్కార్ రాబడికి గండిపడినట్లు తేల్చింది. ఒకేసారి ఐదేళ్లకు లైసెన్స్‌ ఇవ్వడం, మూడు సంవత్సరాలు టర్నోవర్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వడం, ఎక్స్‌ట్రా బిజినెస్‌ గంటలు తెరచినందుకు రూ.57 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేసినట్లు తెలుస్తోంది.

Tonique Liquor Scam Case updates : టానిక్‌ మద్యం దుకాణాల ద్వారా లెక్కల్లోకిరాని, రికార్డుల్లో నమోదుకాని అనధికారిక మద్యం అమ్మకాలు భారీగానే జరిగి ఉండొచ్చని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేసేందుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో అధికారగణం లోతైన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఉన్నతాధికారిక ఒక్కోరకమైన అంశాన్ని అప్పగించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ సూచించినట్లు సమాచారం. పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైతేకాని, టానిక్‌ మద్యం దుకాణం, దాని అనుబంధ మద్యం దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏ మేరకు గండిపడిందో తెలుస్తుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

టానిక్‌ వైన్స్​ కేసు - పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు నిర్ధారణ - Tonic Liquor Stores Case

ఒక్క టానిక్‌ వైన్స్​లోనే రూ.1000 కోట్ల 'పన్ను ఎగవేత' లావాదేవీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.