ETV Bal Bharat Paintathon 2nd Winner Shivansh : పిల్లలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడానికి ఈటీవీ బాల భారత్ ఆధ్వర్యంలో పెయింటథాన్ -2024 కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీల్లో 53,641 మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇందులో భాగంగా టి.శివాన్ష్‌కు రెండో బహుమతి దక్కింది. ఈ పోటీలను మొదటిసారిగా 2021లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి 2022తో పాటు ఈ ఏడాది కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇందులో పాల్గొనే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. చిరు ప్రాయంలో కళాకారులను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఏపీఆర్ ప్రవీణ్ లక్సూరియా కాలనీలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేశ్‌కు చిన్ననాటి నుంచి బొమ్మలు గీయడం ఆయన హాబీ. కానీ అభిరుచివైపు వెళ్లలేపోయినా గచ్చిబౌలిలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. అయితే ఆయన పెళ్లిచేసుకున్న భార్య నిత్యకు కూడా భర్త అలవాటు చూసి చిత్రాలు గీయడం ప్రారంభించిదామె.
ETV Bal Bharat Drawing Competition : తల్లిదండ్రుల భర్త మెళకువలు చెబుతుంటే ఎదురుగా కన్పించే ఎవరైనానా సరే ఇట్టే అవలీలగా పోలికలతో చిత్రాలు గీయడం అలవాటుచేసుకుందామె. వీరి ఇద్దరి అభిరుచి ఒక్కటే కావడంతో వీరికి పుట్టిన శివాన్ష్ సైతం, వీరిని చూసి చిన్ననాటి నుంచి చిత్రాలు పెన్సిల్‌తో గీసి రంగుల వేయడం నేర్చుకున్నాడు. పాఠశాలలో చేరిన నాటి నుంచి రకరకాల చిత్రాలుగీసి రంగులువేసి అలరించేవాడు.
"నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్, క్రాఫ్ట్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది. అలానే డ్రాయింగ్స్ గీయటం అన్ని చేస్తుంటాను. అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు మా అబ్బాయికి వచ్చింది. ఇదేక్రమంలో ఈటీవీ బాల భారత్ డ్రాయింగ్ కాంపిటేషన్‌లో పాల్గొని, సెకెండ్ విన్నర్‌గా నిలిచాడు. ఇది మాకెంతో ఆనందంగా ఉంది."-రాజేశ్, శివాన్ష్ తండ్రి
రాష్ట్రం నుంచి రెండోస్థానంలో విన్నర్‌గా నిలిచి : తమకు ఉన్న అభిరుచిలో తమ కుమారుడు రాణించడంతో అతన్ని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించే బాల భారత్‌లో ఈ ఏడాది నిర్వహించిన పెయింటాతాన్‌లో పోటీల్లో తమ కుమారుడు శివాన్ష్ వేసిన చిత్రాలను ఆన్‌లైన్ ద్వారా పంపారు. అయితే అనూహ్యంగా 3 నుంచి 7 ఏళ్ల వయస్సు విభాగంలో రాష్ట్రం నుంచి రెండోస్థానంలో నిలిచాడు. దీనితో తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని మెళకువలు నేర్చుకుని మరింత మెరుగైన చిత్రాలు గీస్తానని బాలుడు చెబుతున్నాడు.
"నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ, నాన్న ప్రోత్సాహంతో డ్రాయింగ్ మరింత మక్కువ పెరిగింది. అలానే ఈటీవీ బాల భారత్ పెయింట్థాన్ 2024 ప్రోగ్రాంలో నేను పాల్గొని, డ్రాయింగ్ వేశాను. అందులో నాకు రెండవ బహుమతి లభించింది. భవిష్యత్‌లో మరింత మంచిగా బొమ్మలు వేస్తాను."-శివాన్ష్, సెకెండ్ విన్నర్