ETV Bharat / state

"పోలీసులపై మేం దాడి చేయలేదు - ఎవరో దుండగులు మా ర్యాలీలో చొరబడి కుట్ర చేశారు"

సికింద్రాబాద్‌లో ప్రశాంతవాతావరణంలో ర్యాలీ నిర్వహించాం - ఎవరో దుండగులు మా ర్యాలీలో చొరబడి కుట్ర చేశారు : ఎంపీ ఈటల

MP Etela Fires On Congress Party
MP Etela Comments On Rally Clash (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

BJP MP Etela Comments on Rally Clash : కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మార్చే క్రమంలో అనేకసార్లు మతకల్లోలాలు సృష్టించిందని బీజేపీ మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. శవాల మీద కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే దిల్​సుఖ్ నగర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఆలయాల మీద దాడి జరుగుతుంటే అడ్డుకునే దమ్ము ముఖ్యమంత్రికి లేదన్నారు. సికింద్రాబాద్ ఆలయం వద్ద ధర్నా సమయంలో ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్లీపర్ సెల్స్ ఉన్నాయని కేంద్ర నిఘా సంస్థలు ఉన్నాయని చెబుతున్నాయి తప్పితే ఇక్కడి ప్రభుత్వం గుర్తించడం లేదని అవేదన వ్యక్తం చేశారు. హిందువుల మీద విషం చిమ్మేలా సమావేశాలు జరుగుతుంటే ఎందుకు నిరోధించడం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదులు ఎవరూ, స్లీపర్ సెల్స్, సంఘ విద్రోహ శక్తులు ఎవ్వరో నిగ్గు తేల్చేల్సిన అవసరం ఉందన్నారు. గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని అవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వైఖరి వల్ల ఎన్నోసార్లు మతకలహాలు : ఎవరూ చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం ఒక్కటి కూడా బయట పెట్టలేదని ఈటల దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర వేస్తుందని మండిపడ్డారు. బాంబు దాడులు, హత్యలను ఏ మత పెద్దలు హర్షించరన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఇప్పటికైనా అక్రమ అరెస్టులను ఆపాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

"ఇటీవల సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాం. బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారు. పోలీసులు మా కార్యకర్తలను చితకబాదారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని మాత్రమే ఆకాంక్షిస్తుంది. ప్రతీకారం అనేది మా పార్టీలోనే లేదు. కాంగ్రెస్‌ పార్టీ పేరుకే లౌకికవాదం కానీ, మతోన్మాదులను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్‌ సర్కార్​ హయాంలో హైదరాబాద్‌లో అనేక సందర్భాల్లో బాంబులు పేలాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది." -ఈటల రాజేందర్, మల్కాజ్​గిరి ఎంపీ

ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత - పోలీసులపై చెప్పులు విసిరిన నిరసనకారులు

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు - మోండా మార్కెట్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.