ETV Bharat / state

చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపింది - అంతలోనే అందరికి దూరమైంది - ENGINEERING STUDENT DIES ACCIDENT

నానక్​రాంగూడ రోటరీ సమీపంలో బైక్​ను ఢీ కొట్టిన కారు - ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని దుర్మరణం

Engineering Student Dies
Engineering Student Dies In Road Accident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

Engineering Student Dies In Road Accident : నగరంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల చావుకు కారణమవుతున్నారు. తాజాగా నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీ కొట్టిన ఘటనలో వెనక కూర్చున్న ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందగా బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

రాయదుర్గం పోలీసుల వివరాల ప్రకారం : కామారెడ్డి దోమకొండకు చెందిన ఐరేని శివాని (21) గండిపేట సీబీఐటీలో బీటెక్ ఫైనల్​ ఇయర్ చదువుతుంది. గండిపేటలో పెయింగ్ గెస్ట్ (పీజీ)గా ఉంటుంది. నిజామాబాద్ నిజాంసాగర్​లో తాను చదివిన పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించగా, ఆ కార్యక్రమానికి హాజరై స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి బస్సులో హైదరాబాద్​కు వచ్చింది.

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి : జేఎన్​టీయూ వద్ద బస్సు దిగిన ఆమెను తన సీనియర్ విద్యార్థి అయిన సాఫ్ట్​వేర్ ఉద్యోగి వెంకట్ రెడ్జి (26) పీజీకి తీసుకెళ్లేందుకు బైక్​పై ఎక్కించుకొని బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో నానక్​రాంగూడ రోటరీ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు వారి బైకును వెనకవైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న విద్యార్థిని గాల్లో ఎగిరిపడింది.

స్నేహితులను కలిసింది.. అందరికీ దూరమైంది : దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కొండాపూర్ ఆసుపత్రికి తరలించగా శివాని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బైక్ నడిపిన వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా చదువులో చురుగ్గా ఉండే శివాని ఇటీవల ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి ఎంపికైంది. 4 నెలల్లో ఆమె ఉద్యోగంలో చేరాల్సి ఉంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన కొన్ని గంటల్లోనే అందరికీ దూరమవడంతో స్నేహితులందరూ కన్నీటి పర్వతమయ్యారు. కారు డ్రైవర్ సాయికైలాష్​పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

2 ప్రమాదాలు - గాల్లో కలిసిన 10 మంది ప్రాణాలు

బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం - 38 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.