ETV Bharat / state

చెరువుల ఆక్రమణ, అస్తవ్యస్తంగా నిర్మాణాలు - ఇదేనా ఖమ్మం, విజయవాడ వరదలకు కారణం! - Reasons for Floods in TG and AP

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 3:50 PM IST

Floods in Telugu States : ఒక సారి నష్టం జరిగితే రెండో సారి అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మరి పదేపదే నష్టం జరుగుతున్నా సరిదిద్దుకోకుంటే దాన్నే నిర్లక్ష్యం అంటారు. ఆ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం విలయాలు. వీటికి ప్రకృతి ప్రకోపం కారణమైనా మనిషి చేసిన తప్పిదాలు, పాఠాలు నేర్వని తత్వమే నష్టం తీవ్రతను మరింత పెంచింది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి. ఈ విపత్తులు మనిషి ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. మరి ఎలా అప్రమత్తం కావాలి. ఏ జాగ్రత్తలు తీసుకుంటే వరదలను తప్పించుకోగలం. ఈ విపత్తుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి.

Telangana and Andhra Pradesh Floods
Floods in Telugu States (ETV Bharat)

Telangana and Andhra Pradesh Floods : జీవుల మనుగడకు అవసరమైన ప్రతి వస్తువు సమకూరుస్తూ రుణం తీర్చుకోలేనంత మేలు చేస్తోంది ప్రకృతి. కాని మనిషే ఆ మేలును మరచి ప్రకృతితో ఆడుకుంటున్నాడు. ప్రకృతిలోని సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాడు. ఎడాపెడా కాలుష్యాన్ని వదులుతూ భూతాపాన్ని పెంచడం, చెట్ల నరికివేత, కొండలు, గనులను ఎడాపెడా తవ్వడం, జలవనరుల విధ్వంసం, ముందు చూపు లోపించిన పట్టణ ప్రణాళిక ఒకటేమిటి ప్రకృతికి మనిషి చేస్తున్న నష్టాల జాబితా గురించి చెబితే అది చాంతాడంత అవుతుంది. మరి తనకు ఇంత నష్టం చేస్తే ప్రకృతి ఊరుకుంటుందా.

ఏదో ఒక విపత్తు రూపంలో విరుచుకుపడుతుంది. తనకు ఎదురువస్తే తడాఖా ఏమిటో చూపిస్తుంది. అదే సమయంలో ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోండని, తనను కాపాడి మిమ్మల్ని మీరు కాపాడుకోండని, మనుషులకు పదేపదే గుర్తు చేస్తుంది. అయినా మనిషి మారడు. ఎడాపెడా ప్రకృతిని కుళ్లబొడుస్తాడు. జలవనరులను ఇష్టారీతిన ధ్వంసం చేస్తాడు. ఫలితాన్ని అనుభవిస్తాడు. విజయవాడ, ఖమ్మం వరదల రూపంలో ఆ ఫలితం కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విజయవాడ, ఖమ్మం వరదలే కాదు, గత కొన్ని సంవత్సరాల్లో సంభవించిన పలు విపత్తులు మనిషి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి.

ప్రకృతిలో సమతౌల్యం లోపించకుండా : 2013 ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ వరదలు, 2020 హైదరాబాద్‌ వరదలు, ఇటీవల కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ఇలాంటివే. తుపాన్లు, అల్పపీడన ప్రభావాలతో భారీ వర్షాలు కురవడం సాధారణ విషయమే అయినా, ఇటీవల కాలంలో వాటి తీవ్రత బాగా పెరిగింది. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయి గంట వ్యవధిలోనే సెంటీ మీటర్ల కొద్ది వర్షం కురవడం, ఉదయం మండిపోయే ఎండలు, సాయంత్రం కుండపోత వాన. ఇలాంటివి ఈ మధ్య సాధారణ విషయాలుగా మారిపోయాయి. అయితే ఇక ముందు ఇలా జరగకుండా ఉండాలంటే దీనికి ప్రధాన కారణమైన భూతాపాన్ని తగ్గించడం మొట్టమొదటి మార్గం.

పెరుగుతున్న కాలుష్యమే భూతాపానికి ముఖ్య కారణం. అందువల్ల కాలుష్యాన్ని తగ్గించే మార్గాలను అనుసరించాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలి. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కాకుండా సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించాలి. అడవులు, చెట్ల నరికి వేతను నిలిపివేసి పచ్చదనాన్ని పెంచాలి. భూతాపాన్ని తగ్గించి ప్రకృతిలో సమతౌల్యం లోపించకుండా, అది విపత్తుల రూపంలో విరుచుకుపడకుండా చేయడంలో ఈ చర్యలు అత్యంత కీలకం. వరదలు, విపత్తుల నివారణలో జల వనరుల సంరక్షణ మరో కీలక చర్య.

వాగులు ఆక్రమణలకు గురికావడం వల్ల : మనం చెరువులోకి వెళితే, చెరువు మన ఇంటికి వస్తుంది. దశాబ్దం క్రితం నాటి ఉత్తరాఖండ్‌ వరదలైనా, ఇప్పటి విజయవాడ, ఖమ్మం వరదలైనా ఇదే పాఠాన్ని బోధిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఉత్తరాఖండ్‌లో గంగానది తీరం వెంట అది సహజ సిద్ధంగా ప్రవహించే మార్గాలను ఆక్రమించి ఎడాపెడా నిర్మాణాలు, కొండల ధ్వంసం, సొరంగాల తవ్వకం, ఆనకట్టలు, విద్యుత్‌ కేంద్రాలు వంటి భారీ నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా గంగానది ప్రవాహం సహజంగా ముందుకు వెళ్లే మార్గాలు లేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. భారీ నిర్మాణాల వల్ల కేదార్‌నాథ్‌ పర్వతాల్లో సహజత్వం లోపించి కొండచరియలు విరిగిపడ్డాయి.

ఫలితంగా 5 వేల 7 వందల మంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. విజయవాడ మునగడానికి ప్రధాన కారణమైన బుడమేరు, ఖమ్మం వరదలకు కారణమైన మున్నేరు వాగుల పరిస్థితి కూడా ఇలాంటిదే. ఈ రెండు వాగులు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురయ్యాయి. వీటి వెంట పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలిసాయి. ఫలితంగా వాటి సహజసిద్ధ ప్రవాహ మార్గాలు కుంచించుకుపోయాయి. అందుకే భారీ వర్షాలు కురవడవంతో బుడమేరు, మున్నేరు వాగుల్లో నీరు ముందుకు వెళ్లే మార్గం లేక ఊళ్ల మీద విరుచుకుపడ్డాయి. అందువల్ల సహజ వనరులను కాపాడుకునే విషయంలో ఇది నేర్చుకోవాల్సిన మరో పాఠం.

సహజ వనరులను పరిరక్షించుకోవాలి : వరదల నివారణలో ముందుచూపుతో కూడిన పట్టణ ప్రణాళిక కూడా చాలా కీలకం. 2020 అక్టోబర్‌ హైదరాబాద్‌ వరదలతో ఈ విషయం మొదటిసారి తెలిసివచ్చింది. అప్పుడు గంట వ్యవధిలో 10 సెంటీమీటర్ల వర్షం కురవగా నగరం చిగురుటాకులా వణికిపోయింది. అనేక కాలనీలు మునిగిపోయాయి. మరికొన్ని నీటిలో అలాగే ఉంటూ రోజుల తరబడి చెరువులను తలపించాయి. దీనికి కారణం చెరువుల ఆక్రమణ, లోపించిన పట్టణ ప్రణాళికే. హైదరాబాద్‌ నగర జనాభా కోటి దాటింది. ఇంతటి జనాభాకు సరైన స్థలాలు లేక చెరువులు, నాలాల ఆక్రమణ మొదలైంది. వాటిపై నిర్మాణాలు సైతం అస్తవ్యస్తంగా చేపట్టారు. సాధారణ రోజుల్లోనే నీరు సహజసిద్ధంగా ప్రవహించే మార్గాలు లేకుండా పోయాయి.

ఇక వర్షాలు కురిస్తే పీడకలే అన్నట్లుగా మారిపోయింది హైదరాబాద్‌లో పరిస్థితి. పెద్ద వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. హైదరాబాద్‌ లాంటి పరిస్థితులు విజయవాడ, ఖమ్మంలోనూ ఉండడమే ఇప్పుడు ఇంతటి విపత్తుకు కారణం. అందువల్ల ఈ విపత్తులు చెరువులు, నాలాల ఆక్రమణ, లోపించిన పట్టణ ప్రణాళిక, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణలో లోపాలను సరిచేసుకోవాలని చెబుతున్న మరో పాఠం. అందువల్ల ప్రకృతిని కాపాడడంతో పాటు సహజ వనరులను పరిరక్షించుకోవడం అందరూ బాధ్యతగా తీసుకోవాలి. విపత్తుల రూపంలో అది చేసే హెచ్చరికలను ప్రజలు, ప్రభుత్వాలు సహా అందరూ పాటించాలి. లేకుంటే విజయవాడ, ఖమ్మంలో సంభవించిన విపత్తుల లాంటివి అలవాటు చేసుకోవడం, నష్టాలను భరించడమే మిగులుతుంది.

నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.