ETV Bharat / state

తెలంగాణవాసులకు గొప్ప శుభవార్త - విద్యుత్​ ఛార్జీల పెంపు లేదు

విద్యుత్ ఛార్జీల పెంపులేదని ఈఆర్సీ కమిషన్‌ వెల్లడి - 800 యూనిట్లు దాటిన వినియోగదారులకు స్థిర ఛార్జీలు - వివిధ వర్గాలకు స్వల్పంగా పెంచిన విద్యుత్ ఛార్జీలతో రూ. 30 కోట్ల భారం

ERC DENIED POWER HIKE PROPOSAL
ERC Denied to Increase Electricity Charges in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 12:38 PM IST

ERC Denied to Increase Electricity Charges in Telangana : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాన్య వినియోగదారులపై ఎటువంటి విద్యుత్ ఛార్జీల భారం ఉండబోదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఎస్ఆర్​ నగర్‌లోని విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 2024-25 ఏడాది కాలంలో జెన్‌-కో, ట్రాన్స్-కో, డిస్కంలు వేసిన పిటిషన్​లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారుల పరిస్థితులు, ప్రభుత్వ సబ్సిడీ తదితర అంశాలను క్రోడీకరించుకుని కమిషన్ పిటిషన్​లపై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

డిస్కంలు 57 వేల 728.90 రూపాయలకు ప్రతిపాదనలు పంపితే రూ. 54 వేల 183.28 లకు ఆమోదం తెలిపినట్లు కమిషన్ స్పష్టం చేసింది. రెవెన్యూ గ్యాప్ రూ.13 వేల 022.25 కోట్లు ఉందని దాన్ని భర్తీ చేసుకునేలా అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరగా కమీషన్ కేవలం రూ. 11 వేల 156.41 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపిందన్నారు. సిరిసిల్ల సెస్ రెవెన్యూ గ్యాప్ రూ.494.95 కోట్లు ఉందని, దాన్ని పూడ్చేందుకు అనమతి ఇవ్వాలని కోరగా కమీషన్ 343.11 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపిందన్నారు. ఎస్పీడీసీఎల్​కు రూ. 4 వేల 15 కోట్లు, ఎన్పీడీసీఎల్​కు రూ.7 వేల 141 కోట్లు, సిరిసిల్ల సెస్​కు 343.11 కోట్ల రూపాయలు రెవెన్యూ గ్యాప్ ఉందని ఆ మొత్తంతో పాటు ఛార్జీలు కలిపితే మొత్తం రెవెన్యూ గ్యాప్ ఉన్నట్లు డిస్కంలు కమిషన్‌కు నివేదించాయి.

నెలవారీ ఛార్జీలు రూ. 65 నుంచి రూ. 50కి తగ్గింపు : ఎల్.టీ గృహ వినియోగదారులకు ఒకవేయి 699.45 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి రూ. 9 వేల 800.07 కోట్లు మొత్తం కలిపి 11 వేల 499.52 కోట్ల సబ్సిడీని, రెవెన్యూ గ్యాప్‌ను ప్రభుత్వం రాయితీ రూపంలో చెల్లించనున్నట్లు కమిషన్ తెలిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రభుత్వ సబ్సిడీ రూ.2 వేల 374.7 కోట్లకు పెంచిందని, అది 26 శాతం అధికమని కమిషన్ వెల్లడించింది. మొత్తంగా డిస్కంలు 0.47శాతం టారీఫ్‌ను పెంచుకునేందుకు కమిషన్ అనుమతినిచ్చింది. వాస్తవానికి వివిధ వర్గాలకు డిస్కంలు 12 వందల కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని కోరగా అందులో రూ.11 వందల 70 కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదిపోగా మరో 30 కోట్ల రూపాయల భారం పడనుంది. అందులో 800 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే వారిపైనే భారం పడనుంది.

ఎల్.టీ కేటగిరీ గృహ వినియోగదారులకు ఎటువంటి ఛార్జీలు పెంచలేదు. నెలవారీ సాధారణ ఎనర్జీ బిల్లులను కూడా పెంచలేదు. ఎల్.టీ -2 వినియోగదారులకు, కమర్షియల్ వినియోగదారులకు సింగిల్ ఫేజ్ వినియోగదారుల నెలవారీ ఛార్జీలు 65 రూపాయల నుంచి 50 రూపాయలకి తగ్గించారు. 800 యూనిట్ల కంటే అదనంగా కరెంట్‌ను వినియోగించేవారికి స్థిర ఛార్జీలు 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచారు. పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మష్‌రూమ్స్, కుందేళ్ల పెంపకందారులకు 10 హెచ్.పీ నుంచి 25 హెచ్.పీకి లిమిట్ పెంచారు. గొర్రెల పెంపకం దారులకు, మేకల పెంపకం దారులకు, డైరీ ఫార్మింగ్ వారికి 15హెచ్.పీ నుంచి 25 హెచ్.పీ లోడ్ వినియోగించుకునే విధంగా వెసులుబాటు కల్పించారు.

ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల స్థిరఛార్జీలు రూ.50 మినహాయింపు : కాటేజ్ పరిశ్రమలకు నెలకు 30 రూపాయలు కట్టాలనే క్లాజ్‌ను తొలగించారు. వ్యవసాయ రంగానికి మాత్రం యథావిధంగా ఉంచారు. హార్టికల్చర్​కు 15 హెచ్.పీ నుంచి 20 హెచ్.పీకి పెంచారు. వీధి దీపాలకు, పీ.డబ్ల్యూ.ఎస్ స్కీంలకు టారీఫ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల వినియోగాన్ని పెంచేందుకు స్థిర ఛార్జీలు 50 రూపాయలు మినహాయించారు. గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు కిలోవాట్​కు నెలకు 19.37 రూపాయలు పెంచుకునేందుకు డిస్కంలు అనుమతి కోరగా కమిషన్ 16.32 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది.

టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో విద్యుత్‌ను వినియోగించే వారికి ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ అవర్‌లో వినియోగించుకునే వినియోగదారులకు కన్సెషన్ రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచారు. సకాలంలో పిటిషన్లు దాఖలు చేయనందుకు జెన్‌కోకు రూ.396 కోట్లు, ట్రాన్స్‌కోకు రూ.119 కోట్లు, డిస్కంలకు రూ.69 కోట్లు జరిమానా విధించినట్లు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. భవిష్యత్తులో ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

లోటు పూడ్చుకునేందుకు ఛార్జీలు పెంచుకుంటాం - ఈఆర్​సీకి డిస్కంల విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.