Electric Vehicles Summer Precautions : ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వారు ఆందోళన చెందుతుంటారు. గత వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు (Tips For Maintaining Electric Vehicles) ప్రమాదాలకు గురయ్యాయి. వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో, బ్యాటరీలు వేడెక్కడం వల్ల ఇవి అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలంలో విద్యుత్ వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రిక్ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
Tips For Maintaining Electric Vehicles in Summer : ఏప్రిల్ మాసంలోనే ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో ఎండల తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల ఛార్జింగ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రిక్ రంగ నిపుణులు అంటున్నారు. వాహనాలకు ఛార్జింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందులోని బ్యాటరీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా వాటి సామర్థ్యం, జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని ఎలక్ట్రిక్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Electric Scooty Fire Accident : ఛార్జింగ్ ఫుల్ చేసి పక్కన పార్క్ చేశాడు.. అంతలోనే..!
చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రీ కండిషనింగ్ ఫీచర్ ఉంటుందని ఎలక్ట్రిక్ రంగ నిపుణులు అంటున్నారు. ఇది వేడి, చల్లని వాతావరణాలు రెండింటికీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీని వల్ల వాహన సామర్థ్యం మెరుగుపడుతుందని, ఫలితంగా డ్రైవింగ్చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యుత్ వాహనాలను (Electric Vehicles Blast Incidents) ఎండలో కాకుండా నీడలో పార్క్ చేయాలని సూచిస్తున్నారు. తద్వారా బ్యాటరీ వేడెక్కకుండా ఉంటుందని వివరిస్తున్నారు.
20 శాతం నుంచి 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ చేయాలి : ఎలక్ట్రిక్ వాహనాలను 20 శాతం నుంచి 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ చేయాలని ఎలక్ట్రిక్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే, వాటిని ఎక్కువసేపు ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ వేడెక్కిపోతుందని అంటున్నారు. వేసవిలో ఎక్కువసేపు ఛార్జ్ చేస్తే బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ అయిపోతుందంటున్నారు. కొంతమంది బైక్‌లపై దూర ప్రయాణం చేయడానికి ఇష్టపడతారని ఎండాకాలంలో ఈ రకమైన ప్రయాణం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలను నీడ ఉన్న ప్రాంతంలో పార్క్ చేయాలి. ఇంటి దగ్గర వాహనాలను ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇండస్ట్రీయల్‌కు సంబంధించిన కనెక్టర్స్‌నే వాడాలి. వేసవిలో ఎక్కువసేపు ఛార్జ్ చేస్తే బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ అయిపోతుంది. వీలైతే పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రాల వద్ద వాహనాలను ఛార్జింగ్ చేసుకోవాలి. - వై.ఎస్.ఆర్.రాజీవ్, ఎలక్ట్రిక్ రంగ నిపుణులు
పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ.. భారీగా మంటలు.. ముగ్గురికి గాయాలు
వేసవిలో ఇంజిన్, టైర్లు త్వరగా వేడెక్కుతాయి. కొన్ని సందర్భాల్లో టైర్లు పేలిపోయి, ప్రాణ నష్టం వాటిల్లవచ్చని ఎలక్ట్రిక్, ఐసీఈ బేస్డ్ వెహికల్స్ సామర్థ్యం బాగా ఉండాలంటే కచ్చితంగా వాటి టైర్ ప్రెజర్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమాదాల బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.