Sun Parivar Ponzi scam case : సన్ పరివార్ పోంజి స్కీమ్ కేసులో 25.20కోట్లు ఆస్తులను ఈడీ ఆటాచ్ చేసింది. తెలంగాణలో పలు చోట్ల నమోదైన ఎఫ్ఐఆర్లతో పాటు, ఏపీ డిపాజిటర్ల చట్టం కింద నమోదైన కేసుల ఆధారంగా ఈడీ(Enforcement Directorate) దర్యాప్తు చేపట్టింది. సన్ పరివార్ గ్రూప్(Sun Parivar) పేరుతో మెతుకు రవీందర్ అతని సహచరులు, అధిక వడ్డీలకు ఆశచూపి సుమారు 10వేల మంది నుంచి రూ. 158కోట్లు సేకరించారు.
అధిక వడ్డీ ఆశ చూపించారు - సొమ్ము చెల్లించాక బోర్డు తిప్పి ఉడాయించారు
సన్ పరివార్ గ్రూప్‌లోని అనుబంధ కంపెనీలైన మెతుకు చిట్‌ఫండ్స్, మెతుకు వెంచర్స్ లిమిటెడ్, మెట్‌సన్ నిధి లిమిటెడ్, మెతుకు హెర్బల్ లిమిటెడ్, మెడికల్స్ పలు కంపెనీల పేరిట డిపాజిట్లు సేకరించి, వాటితో స్థిర చరాస్థులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. కుటుంబ సభ్యులు, సహచరుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసిన మెతుకు రవీందర్, మోసం బయటపడటంతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు.
విడులైన తర్వాత మరో ఫోంజి స్కీమ్ ప్రారంభించి పెట్టుబడులు స్వీకరించిన రవీందర్, అధిక వడ్డీలు, ఏడాదిలో 100 శాతం లాభాలంటూ అమాయకులను మోసం చేశాడు. అతనిపై నమోదైన కేసులో విచారణ ప్రారంభించిన ఈడీ, దర్యాప్తులో భాగంగా మెతుకు రవీందర్, అతని సహచరులకు సంబంధించిన రూ. 25.20 కోట్ల స్థిర చరాస్థులు, బ్యాంకు బ్యాలెన్స్, షేర్లను అటాచ్ చేసింది.
ED on Fake Part time Jobs Fraud : నగరంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 32.34కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతంలో అటాచ్ చేసింది. మొత్తం 580 ఖాతాల్లోని 32.34 కోట్ల రూపాయలు అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. పార్ట్ టైం ఉద్యోగాల మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైన 50కి పైగా ఎఫ్ఐఆర్ల(FIR) అధారంగా మనీలాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది.
వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగాలపై ఆశచూపుతున్న సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు.హోటళ్లు, టూరిస్ట్ వెబ్‌సైట్లు, రిసార్టులు వంటి వాటికి రేటింగ్ ఇస్తే ఆదాయం వస్తుంది మోసం చేస్తున్నారు. స్పందించిన వారితో బోగస్ మొబైల్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేయించి పెట్టుడులు పెట్టిస్తున్నారు. ఆదాయాన్ని వ్యాలెట్‌లో చూపుతున్నారు. వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తే మరికొంత చెల్లించాలని నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఘరానా మోసం - క్రెడిట్ కార్డు రుణ పరిమితి పెంచుతామంటూ బ్యాంక్ ఖాతా ఖాళీ - Cyber fraud in Hyderabad
ఏం తెలివి భయ్యా నీది - నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు దోచేశాడుగా