EC Permitted Bhadradri Kalyanam Live : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది.
సీఎం రేవంత్రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చునని ఈనెల 4న పేర్కొంది. అయితే లైవ్ టెలికాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం, కల్యాణ మహోత్సవం విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకొని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని ఈనెల 17న ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు.
భద్రాద్రి సీతమ్మకు కానుకగా త్రీడీ చీర - చూస్తే వావ్ అనాల్సిందే! - Making Video of 3D Saree
Bhadradri Sitaramula Kalyanam : సుమారు నలభై ఏళ్లుగా కుల, మత, జాతులకు అతీతంగా దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే, భద్రాచలంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. రేపు మిథిలా మైదానంలో స్వామివారి కల్యాణం వైభవంగా జరగనుంది. ఇందు కోసం మిథిలా మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి పురవీధులు మార్మోగుతున్నాయి.
Sri Rama Navami Festival 2024 :శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు. ఈ ఏడాది భక్తుల అందరకీ ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఉచిత భోజన వసతి సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.