ETV Bharat / state

ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలన్న ఈసీ నిబంధనపై ప్రధాన పార్టీల అభ్యంతరం! - EC CEO Mukesh Kumar Meena - EC CEO MUKESH KUMAR MEENA

EC CEO Mukesh Kumar Meena key instructions: ఎన్నికల కోసం రాజకీయపార్టీల ప్రచారంపై అనుమతులకు సువిధ పోర్టల్ ను వినియోగించుకోవాలని పలు రాజకీయ పార్టీలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా సూచించారు. అయితే, ఇంటింటికి ప్రచారానికి సైతం ఈసీ అనుమతి తీసుకోవాలన్న నిబంధనపై ప్రధాన పార్టీలన్ని అభ్యంతరం వెలిబుచ్చాయి.

EC CEO Mukesh Kumar Meena key instructions

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 7:42 PM IST

Updated : Mar 26, 2024, 10:10 PM IST

EC CEO Mukesh Kumar Meena key instructions: రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం నిర్వహించారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. కరపత్రాలు పంచిపెట్టేందుకూ అనుమతి తీసుకోవాలన్నారు. వీటిపై రాజకీయ పార్టీల అభిప్రాయం కోరారు. సభలు, ర్యాలీలు, ప్రచారంపై 48 గంటల ముందుగానే సువిధా యాప్, పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈసీ నిబంధనలపై అధికార, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిబంధనల వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి.

సువిధా యాప్, పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆన్​లైన్ నామినేషన్లు, అఫిడవిట్​లు దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల కోసమే సువిధా పోర్టల్ రూపొందించామని వివరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు అనుసరించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన అనుమతుల పై అవగాహన ఉండాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

గతంలో ఎప్పుడూ ఈ తరహా నిబంధన లేదు. 2023 డిసెంబర్​లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ తరహా నిబంధనలు లేవు. ఇంటింటి ప్రచారానికి ప్రతీ ఒక్కరికీ అనుమతి కావాలనటం అభ్యంతరకరమైన విధానమని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా అన్నారు. ఇది చాలా అభ్యంతరకరమని ఎన్నికల ప్రధానాధికారికి తెలియచెప్పామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల్లోనూ ఈ తరహా నిబంధనలు లేవన్నారు. అధికార వైసీపీ ఓట్ల కొనుగోలుకు చర్చిలు, మసీదుల్లో ప్రజలకు డబ్బులు పంచుతున్నారని, ఇలా రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వకూడదు ఇది స్పష్టంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అని, దీనిపై సీవిజిల్ యాప్ ద్వారానూ ఫిర్యాదు చేశామన్నారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా, ఒత్తిళ్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు.

ఓటు ఉందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి: మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఖురేషీ

ప్రతిపక్ష పార్టీలకు నిబంధనలు పెట్టి అధికార పార్టీ కుక్కర్లు, చీరలు, డబ్బులు మద్యం పంపిణీ చేసుకోవచ్చా అంటూ నేతలు ప్రశ్నించారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఈసీ ఏం చర్యలు తీసుకుంటోంది, ఇదేనా పారదర్శకత అని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. టీడీపీ తరపున ఏం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు ఇది పూర్తిగా అభ్యంతరకరమన్నారు. ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలి, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో యాక్టివ్​గా ఉన్నా మా పార్టీకి గుర్తు ఎందుకు ఇవ్వలేదు : కేఏ పాల్

ఎన్నికల్లో ఇంటింటికీ ప్రచారానికి అనుమతి తీసుకోవాలి అంటే ఎలా వీలవుతుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిలదీశారు. కరపత్రాలు పంపిణీ చేయాలన్నా అనుమతి అంటే ఇబ్బంది అని ఈసీకి చెప్పామన్నారు. డివిజన్ స్థాయిలో చాలా మంది నేతలు రిటర్నింగ్ అధికారులు వద్ద అనుమతులు తీసుకోవడం కష్టం అని ఈసీకి తెలియజేశామన్నారు. 48 గంటల ముందు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకోవాలంటే ఎలా ఆ సమయాన్ని తగ్గించాలని మల్లాది విష్ణు ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సమాధానంపై టీడీపీ ఆగ్రహం

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో రాజకీయ పార్టీల భేటీ

Last Updated : Mar 26, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.