ETV Bharat / state

ఈఏపీ​సెట్ షెడ్యూలు విడుదల - ఈనెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ - TS EAPCET Notification 2024

EAPCET Schedule Release in Telangana: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ ​సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 21న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.

EAPCET Schedule Release
EAPCET Schedule Release in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 3:51 PM IST

Updated : Feb 6, 2024, 5:09 PM IST

EAPCET Schedule Release in Telangana: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి(Board of Education), ఈఏపీసెట్ కన్వీనర్ డీన్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలిలో జరిగిన సమావేశంలో ఉన్నత విద్యామంలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, జేఎన్ టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కమిటీ ఛైర్మన్ ఎస్ కే మహమూద్, ఈఏపీసెట్ కన్వీనర్ డీన్ కుమార్ సహా పలువురు హాజరయ్యారు.

TS EAPCET Notification 2024 : ఇక ఈ నెల 21న నోటిఫికేషన్ ఇచ్చి, 26 నుంచి ఆన్​లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్న ఈఏపీ సెట్ కన్వీనర్ డీన్ కుమార్(EAPCET Convener Dean Kumar), మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలపై సర్కార్ కసరత్తు - ఈ నెలలోనే ఆ రిజల్ట్స్​!

TS EAMCET 2024 : పీజీఈ సెట్​కు సంబంధించిన షెడ్యూల్​ను సైతం ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మార్చి 12న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. మార్చి 16 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. జూన్ 6 నుంచి 9 వరకు పీజీఈసెట్ పరీక్షలు(PGCET Exams) నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఇటీవల ఎంసెట్ పేరును ఈఏపీసెట్​గా మార్చిన సంగతి తెలిసిందే.

TS EAPCET Important Dates : (ఈఏపీసెట్ పరీక్ష ముఖ్య తేదీలు)

క్రమ సంఖ్య అంశంప్రారంభం తేదీచివరి తేదీ
01నోటిఫికేషన్ విడుదల21 ఫిబ్రవరి
02దరఖాస్తుల స్వీకరణ20 ఫిబ్రవరి06 ఏప్రిల్
03పరీక్షలు నిర్వహణ09 మే12 మే

Telangana Intermediate Exam Dates 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్​ పరీక్షల తేదీలను ఇప్పటికే తెలంగాణ స్టేట్​ ఇంటర్మీడియట్​ బోర్డు ప్రకటించింది. ఈనెల 28 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటకే ప్రారంభమైన ఇంటర్​ ప్రాక్టికల్స్, ఈనెల 15 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్​ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్​ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ అర్హతతో ఎప్​సెట్​ నోటిఫికేషన్​కు అప్లై చేసుకోవచ్చు. ప్రధానంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ సీట్ల భర్తీకి ఈఏపీ పరీక్ష నిర్వహిస్తారు.

బీటెక్ విద్యార్థులకు అలర్ట్ - ఫస్ట్ ఇయర్​లో ఫెయిలైనా రెండో సంవత్సరానికి 'ప్రమోషన్'

రెండో తరగతి పాఠాలు చదవలేని 18 ఏళ్ల విద్యార్థులు- ఆందోళనకరంగా ASER-2023 స్టడీ రిపోర్ట్

Last Updated : Feb 6, 2024, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.