ETV Bharat / state

35 ఏళ్లు పోలీస్​ ఆఫీసర్​గా ప్రజలకు సేవ - సంతృప్తిగా ఉంది: డీజీపీ - DGP ON RETIREMENT

మారిషస్ వెళ్లి ఎర్రచందనం కేసు ఛేదించడం సంతోషాన్నిచ్చింది - సిఫార్సు లేకుండా సామాన్యులకు న్యాయం జరిగిన రోజే నిజమైన పోలీసింగ్‌ అన్న డీజీపీ

Dwaraka Tirumala Rao Retirement as DGP in AP
Dwaraka Tirumala Rao Retirement as DGP in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 4:36 PM IST

Dwaraka Tirumala Rao Retirement as DGP in AP : పోలీస్ ఆఫీసర్​గా 35 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన తాను సంతృప్తిగా సర్వీసును ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టులను కట్టడి చేయగలిగామని తెలిపారు. చిన్నారులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని అన్నారు.

ఆ కేసు ఎక్కువ సంతోషానిచ్చింది : అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగామని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకూ ప్రజల భాగస్వామ్యంతో 28,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వేలి ముద్రల ఆధారంగా నేరాలను గుర్తించి చేధించడంలో దేశంలోనే ఏపీ, తెలంగాణ ముందున్నాయన్నారు.

గంజాయి, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కొత్తవలసలోని రెల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రికమండేషన్ లేకుండా సామాన్యులకు పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరిగిన రోజే నిజమైన పోలీసింగ్ అన్న డీజీపీ ఆరోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సర్వీసులో మారిషస్ వెళ్లి ఎర్రచందనం కేసును ఛేదించడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు.

ఆర్టీసీ ఎండీగా రీ ఎంప్లాయ్ : అయితే విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న హరీష్‌కుమార్‌ గుప్తాకు DGPగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు. ఉద్యోగ విరమణ తర్వాత ద్వారకా తిరుమల రావును ఆర్టీసీ ఎండీగా రీ ఎంప్లాయ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏడాది పాటు ఆయన ఆర్టీసీ ఎండీగా కొనసాగుతారని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రంలో సైబర్‌ క్రైమ్‌ పెరిగింది: డీజీపీ ద్వారకా తిరుమలరావు

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.