DSP Gangadhar Complaint to CM Against Stephen Ravindra : సైబరాబాద్ మాజీ సీపీ, ప్రస్తుత హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ, రవీంద్ర సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. భూ కబ్జాదారులతో చేయి కలిపి, ఎలాంటి విచారణ చేయకుండానే తనను సస్పెండ్ చేశారన్నారు.
DSP Gangadhar Complaint to Cm Revanth Reddy : అప్పటి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశానుసారంగానే ల్యాండ్ గ్రాబర్స్‌పై కేసు నమోదు చేసినందుకు సస్పెండ్ చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. దీనివల్ల పదోన్నతి అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతి అవకాశం పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, న్యాయస్థానం ఉత్తర్వులను స్టీఫెన్ రవీంద్ర లెక్క చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలువురు కింది స్థాయి అధికారులను ఆయన ఇబ్బంది పెట్టారంటూ ఫిర్యాదు కాపీని సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, హోం శాఖ, డీవోపీటీకి పంపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు - ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్ - TS PHONE TAPPING CASE UPDATE
స్టీఫెన్ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు : ఓ భూ వివాదంలో తలదూర్చానంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విచారణ చేయకుండానే సస్పెండ్ చేశారని గంగాధర్ పేర్కొన్నారు. శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 68, కొల్లూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 278, భూ వివాదంలో కేసులు నమోదు చేసిన కారణంగా సస్పెండ్ చేశారని తెలిపారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు : సస్పెండ్ అయిన అధికారులపై మూడు నుంచి ఆరు నెలలలోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలనే జీవో ఉన్నప్పటికీ తనకు న్యాయం జరగలేదన్నారు. దీంతో తన బ్యాచ్ ఇన్స్పెక్టర్లంతా డీఎస్పీలుగా ప్రమోషన్స్ పొందినా, తనకు మాత్రం ప్రమోషన్ రాలేదని సీఎంకు వివరించారు. స్టీఫెన్ రవీంద్ర ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడంతోనే ప్రమోషన్ కమిటీ తనకు ప్రమోషన్ ఇవ్వలేదన్నారు. తన ప్రమోషన్‌ను పరిశీలించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, స్టీఫెన్ రవీంద్ర లెక్క చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టీఫెన్ రవీంద్ర చాలా మంది కింది స్థాయి పోలీస్ అధికారులను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని వివరించారు.
రెండో రోజు ప్రణీత్‌రావు విచారణ - బంజారాహిల్స్ పీఎస్‌లోకి ఎవరినీ అనుమతించని పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు- రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీ - phone tapping case update