ETV Bharat / state

తెలంగాణలో మెగా, ఆంధ్రాలో దగా డీఎస్సీ - జగన్నాటకంలో ఆవిరైపోయిన టీచర్ పోస్టులు - DSC Notification in AP

DSC Notification in AP : ఏపీలో కంటే బడులు, పోస్టులు తక్కువే ఉన్నా తెలంగాణలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ వెలువడింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సరిపోయేంత సమయం ఇచ్చారు. దీంతో పాటు అక్కడ అప్రెంటిస్‌షిప్‌ విధానమూ లేదు. ఏపీలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నా, ఎన్నికల ముందు కేవలం 6,100 పోస్టులతో దగా డీఎస్సీ ఇచ్చింది వైసీపీ సర్కార్.

DSC Posts in AP
DSC Notification in AP
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 7:55 AM IST

తెలంగాణలో మెగా, ఆంధ్రాలో దగా డీఎస్సీ - జగన్నాటకంలో ఆవిరైపోయిన టీచర్ పోస్టులు

DSC Notification in AP : తెలంగాణలో 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదలైంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 29,571 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 28 లక్షల మంది. 2017లో 8,792 పోస్టులు భర్తీచేశారు. ఇవికాకుండా గురుకులాల్లో తొమ్మిదేళ్లలో మూడు విడతల్లో 27వేల బోధన పోస్టుల నియామకాలు చేశారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు 44,426 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 38.25 లక్షల మంది.

టీడీపీ హయాంలో 18వేలకు పైగా పోస్టులతో రెండు డీఎస్సీలు వేశారు. జగన్‌ సర్కార్‌ ఐదేళ్లకు కలిపి 6,100 పోస్టులనే ప్రకటించింది. తెలంగాణ కంటే ఏపీలో బడులు విద్యార్థులు ఎక్కువే అయినా పోస్టుల సంఖ్య పెరగలేదు. ప్రపంచ బ్యాంకు రుణం(World Bank loan) కోసం వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకంలో పోస్టులు ఆవిరైపోతున్నాయి. పక్కనఉన్న తెలంగాణలో టీచర్ ఖాళీలను వెతికి మరీ భర్తీచేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం జగన్‌ ప్రభుత్వం ఉన్న ఖాళీలను దాచేసి, నిరుద్యోగులను మోసగిస్తోంది.

Daga DSC in Andhra Pradesh : వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ప్రతీ సంవత్సరం డీఎస్సీ నిర్వహించిందా అంటే అదీ లేదు. జగన్‌ ప్రభుత్వం పెంచిన రెండేళ్ల పదవీ విరమణ వయస్సు గడువు జనవరితో ముగిసింది. రాబోయే నెలల్లో పదవీ విరమణలు విరివిగా ఉంటాయి. కానీ ప్రభుత్వం 6,100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి ఇక ఖాళీలు లేవంటోంది. పైగా ఎన్నికల వేళ హడావిడిగా వెలువరించిన నోటీఫికేషన్లో అభ్యర్దులకు చదువుకునేందుకు సరిపడా సమయాన్ని కూడా కేటాయించలేదు.

పరీక్ష అనంతరం అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందని పేర్కొనడం అభ్యర్దుల్లో ఒకింత అసహనాన్ని, గందరగోళాన్ని రేకెత్తించింది. చదువుపై పెట్టే ప్రతిపైసాను పెట్టుబడిగా భావిస్తానని, ప్రభుత్వ బడుల్లో(Government Schools) చదివే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడాలని సీఎం జగన్‌ తరచూ సభల్లో ఊదరగొడుతూ ఉంటారు. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోతే గ్లోబల్‌ విద్యార్థులు ఎలా తయారవుతారు.? ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పెట్టుబడి కాదా? అన్న విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల - పోస్టుల వివరాలు ఇవే

బడుల నిర్వహణలోనూ రివర్స్ టెండరింగ్ : తెలంగాణలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధనను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. బడులు లేకపోతే కొత్తవాటిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పేద పిల్లలకు బడులను ఇంటికి సమీపంలో ఉంచేలా చూస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం బడుల నిర్వహణలోనూ రివర్స్‌ విధానం పాటిస్తోంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించింది.

ప్రాథమిక బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి వాటికవే మూతపడుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 587 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. విలీనం కారణంగా 118 బడులకు తాళాలు వేశారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడుల(Co-Educational Schools) సంఖ్య 9,602కు పెరిగింది. మూతపడుతున్న వాటిలో ఎక్కువగా ఎస్సీ కాలనీలు, ఎస్టీల ఆవాసాల్లో ఉన్నవే. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీలు, గిరిజనులకు ప్రాథమిక విద్య దూరమవుతుంది. ఇంత జరుగుతున్నా జగన్‌ సర్కార్‌ మాత్రం మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధనంటూ గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తోంది.

ఒక్కోసారి ఒక్కో ప్రకటన : ఉపాధ్యాయ ఖాళీలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కోసారి ఒక్కో మాట చెప్తూ బుకాయించారు. పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయని, పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలేమీ రాలేదని గతేడాది మార్చి 20న శాసనమండలిలో ప్రకటించారు. తర్వాత గతేడాది సెప్టెంబరు 22న 8,366 పోస్టులు అవసరమని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చారు.

ఈ సమయంలోనే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో 1,88,162 పోస్టులు ఉంటే పనిచేస్తున్న వారు 1,69,642 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల డీఎస్సీ ప్రకటన((Telangana DSC Notification) సమయంలో 6,100 పోస్టులు ప్రకటించి ఏప్రిల్‌ వరకు వచ్చే ఖాళీలన్నీ కలిపితేనే ఈ పోస్టులు వచ్చాయన్నారు. మంత్రి బొత్స చేసిన ప్రకటనల్లో ఒకదాంతో మరోదానికి సంబంధమే లేదు. ఎన్నికలకు నెల ముందు డీఎస్సీ వేసి, తగిన సమయం ఇవ్వకుండా నిరుద్యోగులను చిత్రహింసలు పెడుతున్నారు.

11 వేలకు పైగా పోస్టులతో నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ - మే లేదా జూన్​లో ఎగ్జామ్స్

14 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం : డీఎస్సీ 2008 అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.