ETV Bharat / state

'అప్పటికి, ఇప్పటికి 109 ప్రశ్నల జవాబులు మార్చారు' : డీఎస్సీ ఫైనల్​ 'కీ'పై వెల్లువెత్తిన అభ్యంతరాలు - DSC Final Key Objections - DSC FINAL KEY OBJECTIONS

Objections on DSC Final Key : రాష్ట్రంలో డీఎస్సీ తుది ‘కీ’పై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వందలాది మంది అభ్యర్థులు పాఠ్య పుస్తకాలను తీసుకుని సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రాథమిక, తుది 'కీ' మధ్య 109 ప్రశ్నల జవాబులను మార్చినట్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో జనరల్‌ ర్యాంకు జాబితా ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Huge Objections in DSC Exam Final Key
Objections in DSC Final Key (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 9:04 AM IST

Huge Objections on DSC Exam Final Key : రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ తుది ‘కీ’పై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వందల మంది అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను తీసుకుని సోమవారం ఉదయమే పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కార్యాలయానికి తరలివచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం మొత్తం 2.45 లక్షల మంది పోటీపడ్డారు. ఈ నెల 6న రాత్రి డీఎస్సీ తుది 'కీ'ని విద్యాశాఖ ప్రకటించింది. ప్రాథమిక, తుది 'కీ'ల మధ్య సుమారు 109 ప్రశ్నల జవాబులను మార్చింది.

మరో 59 ప్రశ్నలకు అర మార్కు చొప్పున కలిపింది. విద్యాశాఖ తుది ‘కీ'ని ప్రకటించిన తర్వాత రెండు రోజులు సెలవులు కావడంతో సోమవారం సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల నుంచి వందల మంది అభ్యర్థులు విద్యా శాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది 'కీ'లో మార్చారని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. విద్యాశాఖ ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని జవాబులను తాము గుర్తించినా, తుది ‘కీ’లో వాటిని తప్పుగా చూపారని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు కె.లింగయ్య ఎస్‌సీఈఆర్‌టీలో టెట్‌ ప్రత్యేకాధికారి రేవతి రెడ్డికి వివరించారు.

పలు ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు : టెట్‌లో తెలుగు విభాగంలో ‘ఏకాదేశం అంటే’ అని ఒక ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్నకు ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది సరైన జవాబు. గత జూన్​ 12న వెలువడిన ఫలితాల్లో దానికి మార్కు ఇచ్చారు. కానీ డీఎస్సీలో మాత్రం ప్రశ్నను తిప్పి అడిగారు. 'ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు’ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. 'ఆదేశం' సరైన జవాబు అని విద్యాశాఖ చూపింది. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నట్లుగానే తాము ‘ఏకాదేశం’ అని గుర్తించామని, ఆ ప్రశ్నకు మార్కులు ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇలా పలు ప్రశ్నలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అభ్యర్థులకు చెబుతున్నారు. తుది 'కీ'పై అభ్యంతరాలు రావడంతో డీఎస్సీ, టెట్‌ మార్కులను కలిపి ఇచ్చే జనరల్‌ ర్యాంకు జాబితా (జీఆర్‌ఎల్‌) వెల్లడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తుది ‘కీ’ వెల్లడించిన సందర్భంగా వారం రోజుల్లో జీఆర్‌ఎల్‌ ఇస్తామని అధికారులు చెప్పినా, అది మరింత ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.

తెలంగాణ డీఎస్సీ ఫైనల్​ 'కీ' విడుదల - చెక్​ చేసుకునేందుకు దిగువ లింక్​ మీకోసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.