ETV Bharat / state

దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్లీజ్​- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు

DSC Candidates Protest  in Andhra Pradesh : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన DSC ప్రకటన మోసమంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా వేచి చూస్తున్న వారి పట్ల ప్రభుత్వం వైఖరి దయనీయమని నిరాశ చెందుతున్నారు. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్​ ఇవ్వాలని వేడుకుంటున్నారు. దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలంటూ నిరసన బాట పట్టారు.

dsc_candidates_protest_in_andhra_pradesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 4:25 PM IST

Updated : Feb 3, 2024, 4:43 PM IST

DSC Candidates Protest in Andhra Pradesh : ఐదేళ్లుగా నిరుద్యోగులను ఊరిస్తున్న డీఎస్సీ ఉద్యోగాలు విడుదల చేసిన ప్రభుత్వం కేవలం ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగతున్నాయి. నాడు అధికారంలో వచ్చేందుకు ఇష్టారీతిన హామీలు ఇచ్చి, ఓట్లు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి లేక విలవిల లాడుతుంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. నేడు అనంతపురంలో నిరుద్యోగ యువత కలెక్టర్​ ఆఫీస్​ బాట పట్టారు. తిరుపతిలోనూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చెవిలో క్యాలీఫ్లవర్​ పెట్టుకుని నిరుద్యోగులు నిరసన చేపట్టారు.

అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన - జగన్​కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక

DSC Candidates Protest Demand Jobs Notification in Anantapur : అనంతపురంలో DSC అభ్యర్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మెగా DSC విడుదల చేయాలంటూ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ గేట్లు తోసుకొని లోనికి ప్రవేశించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత జగన్ నిరుద్యోగులను మోసం చేసేలా DSC నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. 6వేల 100 పోస్టుల్లో అనంతపురం జిల్లాకు కేవలం నాలుగు వస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే మెగా డీఎస్పీ ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

మూడు రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించాలి - 10న ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్ : డీవైఎఫ్​ఐ

Strange Protest by Telugu Yuvatha on Mega DSC Notification : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన DSC ప్రకటన మోసమంటూ తెలుగు యువత ఆధ్వర్యంలోనిరుద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతి RDO కార్యాలయం ఎదుట క్యాలిఫ్లవర్‌లను చెవిలో పెట్టుకుని ధర్నా దిగారు. ఓట్ల కోసమే డీఎస్సీ ప్రకటించారంటూ 6,100 పోస్టులతో డిఎస్సీ అనే ప్లకార్డులను తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల నినాదాలు హోరెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ విడుదల చేస్తానన్న జగన్‌ నాలుగున్నర ఏళ్లైన ఒక్క డీఎస్సీ పోస్టు కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం మాత్రమే తూతుమంత్రంగా డీఎస్సీ పోస్టులను విడుదల చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే యువతకు న్యాయం చేస్తారని తెలుగుయువత నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!

ఉద్యోగాలివ్వాలని.. తాడేపల్లిలో 98 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల వినూత్న నిరసన

దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్లీజ్​- రాష్ట్రంలో నిరుద్యోగుల కష్టాలు

Last Updated : Feb 3, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.