Man Attacked Bus Conductor in Andhra Pradesh : కొంత మంది వ్యక్తులు మద్యం సేవించేందుకు ప్రైవేట్ ప్రాంతాన్ని కాకుండా బహిరంగ ప్రాంతాల్లో తాగి వీరంగం సృష్టస్తుంటారు. ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితికి చేరుకుంటారు. మనం వారికి ఎంత నచ్చజెప్పినా, వారు వినకపోగా మనతోనే వాగ్వాదానికి దిగుతుంటారు. వీరి వల్ల తోటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడతారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అనంతరం టికెట్ తీసుకున్నాడు. తన స్టాప్ వచ్చిందని కండక్టర్ చెబితే వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగాడు. కండక్టర్‌తో పాటు తోటి ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ప్రయాణికులు అతడికి తగిన బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో జరిగింది.
Man Attacked Bus Conductor : కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. చెన్నరాయుడు అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి మద్యం సేవించి కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఎక్కి, మంటపంపల్లికి టికెట్టు తీసుకున్నాడు. అయితే మంటపంపల్లి బస్టాండ్ వద్దకు బస్సు రాగానే చెన్నరాయుడు దిగకపోవడంతో కండక్టర్ బస్సు దిగమని కోరాడు. మద్యం మత్తులో ఉన్న చెన్నరాయుడు బస్సు దిగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు.
90ml బాటిల్ తెస్తేనే నీళ్లలోంచి బయటకొస్తా - హుస్సేన్‌సాగర్‌లో దిగి యువకుడి హల్చల్
People crushed Drunken Man Viral Video : వేరే దగ్గరకు వెళ్లడానికి టికెట్ తీసుకోమని కండక్టర్ చిన్నరాయుడుతో చెబితే కండక్టర్‌పై దాడికి దిగాడు. ఇదేంటని ప్రశ్నించిన తోటి ప్రయాణికులపై కూడా మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పాదరక్షతో దాడి చేసి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో తోటి ప్రయాణికులు అందరూ కలిసి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి, బస్సు నందలూరులోకి రాగానే పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం నందలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.