Drinking Water Problems in Guntur District : అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక జనం మురికి నీళ్లు తాగుతున్నా ఓట్లడిగే ప్రజా ప్రతినిధులకు కనబడటం లేదు. కాదు కావాలనే ఇలా చేస్తున్నారని అంటున్నారు విసిగెత్తిన ప్రజలు. ప్రచార ఆర్భాటాలప్పుడు కనిపించని ఎన్నికల నియమావళి దాహంతో అల్లాడిపోతున్న వారికి నీళ్లు అందిస్తుంటే గుర్తొస్తుందా అని కాకుమాను (Kakumanu) ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
కష్టాలు తీర్చలేని ప్రభుత్వం దిగిపోవాలి - ఫిరంగిపురంలో నీటి కోసం ఆందోళన
No Drinking Water Supply in Guntur : గుంటూరు జిల్లా కాకుమానులో 10 రోజులుగా నీటి సరఫరా లేక గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. తాగు నీటి (Drinking Water) చెరువు పూర్తిగా ఎండిపోడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. గత్యంతరం లేక రక్షిత మంచి నీటి పథకం వద్ద బావులలో ఉన్న అపరిశుభ్ర నీటినే తోడుకుని దాహం తీర్చుకుంటున్నారు. మరికొందరు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి నీటిని కొనుక్కుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజల దాహం కేకలు మాత్రం అధికారులు, స్థానిక నేతలకు వినబడటం లేదు. నీరు ఎప్పుడు వదులుతారంటూ గ్రామస్థులంతా కలిసి పంచాయతీ అధికారులను నిలదీశారు. అయినా వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలతో సతమతమవుతున్నా నాయకులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడిగేందుకు వస్తారు కదా అప్పుడు వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.
'మా గ్రామం ఉన్నట్టయినా గుర్తుందా..' అధికారులపై గ్రామస్థుల ఆగ్రహానికి కారణమేంటంటే..?
'ఒక్క చెరువులో నీరు లేదు. కనీసం గొంతు కూడా తడపుకోలేని పరిస్థితి. ఎన్నికలప్పుడు ఇంటి ముందు నీటి డబ్బాలు నిండుగా ఉంటాయని చెప్పిన వైఎస్సార్సీపీ నేతలకు ఇప్పుడు మా కష్టాలు కనబడటం లేదా? మురికిగా ఉన్న నీళ్లు మోసుకొచ్చుకుని తాగుతున్నాం. కొనుక్కుందామంటే నాలుగు నీటి కేన్లకు వెయ్యి రూపాయలు అని చెప్తున్నారు. అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకుని వస్తారో చూస్తాం.' -స్థానిక ప్రజలు
ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు..ఒక్కో బావిపై 50వరకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు
Water Scarcity : మేము నీటి కోసం రోడ్డొక్కి నిరసన తెలిపితే మా సమస్య తీర్చని అధికారులు ఓ దాత మాకు నీరందిస్తే ఎలా ఆపుతారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని (Election Code) సాకుగా చేసుకుని మాకు నీరే ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు.