ETV Bharat / state

తాగేందుకు నీళ్లు లేవు - సమస్యలతోనే సావాసం - ఆటోనగర్​లో కార్మికుల కష్టాలు - ఆటోనగర్‌ వాసులు సమస్యలు

Drinking Water Problems in Guntur Auto Nagar : ఆటోనగర్‌ వాసులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. పరిశ్రమల్లో దాదాపు 30 వేల మంది పని చేస్తున్నా మౌలిక వసతుల కల్పన జరగలేదు. కనీసం తాగు నీటికీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో నీటిని కొనుక్కొని తాగుతున్నారు. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా గొంతు తడుస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అంతర్గత రహదారులు, మురుగునీటి వ్యవస్థ సైతం అధ్వానంగా మారింది.

drinking_water_problems_in_guntur_auto_nagar

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 12:42 PM IST

తాగేందుకు నీళ్లు లేవు - సమస్యలతోనే సావాసం - ఆటోనగర్​లో కార్మికుల కష్టాలు

Drinking Water Problems in Guntur Auto Nagar : గుంటూరు ప్రజలు ఓ పక్క కలుషిత నీటి సరఫరాతో ఇక్కట్లు పడుతుంటే మరోపక్క ఆటోనగర్ వాసులు గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నారు. గుంటూరు శివారు విజయవాడ రహదారిలో 40 ఏళ్ల కిందట ఆటోనగర్‌ ఏర్పాటు చేయగా నేటికీ అక్కడికి సరైన మంచినీటి సరఫరా (Supply) లేదు. ఆటోమొబైల్ రంగంలో విడిభాగాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో దాదాపు 3 వేలకు పైగా పరిశ్రమలున్నాయి. ఫోర్డ్, కియా, టాటా, మారుతీ, వోక్సోవ్యాగన్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల షోరూమ్‌లు ఉన్నాయి. సుమారు 30 వేల మందికి పైగా ఇక్కడ ఉపాధి (employment) పొందుతున్నారు. వీరంతా గొంతు తడుపుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.

Drinking Water Crisis Guntur : ఆటోనగర్‌కు కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులే కాకుండా నిత్యం వందలాది మంది వాహనాల మరమ్మతుల పనుల మీద వస్తుంటారు. వీరికి తాగునీరు అందించడంపై ఏపీఐఐసీ (APIIC), కార్పొరేషన్ దృష్టి సారించ లేదు. ఫలితంగా వారందరికీ గొంతెండుతోంది. దుకాణాలు, హోటళ్లలో స్థానికులు నీరు కొనుగోలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఏపీఐఐసీ ఆటోనగర్‌కు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 6 కోట్ల నిధులు ఇచ్చింది. అందులో 4.5 కోట్ల రూపాయలతో తక్కెళ్లపాడు తాగునీటి (Drinking Water) శుద్ధి కేంద్రం నుంచి ఆటోనగర్‌కు పైపులైన్లు, రిజర్వాయర్, సరఫరా పైపులైను వ్యవస్థను కొంతమేరకు సిద్ధం చేశారు. కార్పొరేషన్ పెద్ద నీటి కనెక్షన్‌కు 55 వేలు, చిన్న కుళాయికి 18 వేలు చెల్లించమనడంతో స్థానిక పరిశ్రమల నిర్వాహకులు, వ్యాపారులు, దుకాణదారులు ముందుకు రాలేదు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పైపులైన్ల పనులు నిలిచిపోయాయి.

ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు

'ఒక్క నీటి పంపు లేదు. పేరుకి ఒక వాటర్​ ట్యాంకర్​ ఉన్నా దాని వల్ల ఉపయోగం లేదు. ఎన్నో ఏళ్లుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా పాలకులు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. కుళాయి, పంపులు లేవు, వాటర్​ ట్యాంకులు తెచ్చుకుని పనులు చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి మాకు తాగునీటి సౌకర్యం కల్పించండి. ' - ఆటోనగర్​ కార్మికులు

Auto Nagar People Water Problems : మెకానిక్ పనుల వల్ల శరీరానికి అయిల్, మురికి, మట్టి ఎక్కువగా అవుతుందని, కనీసం భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా నీరు లేదని వాపోతున్నారు. ట్యాంకుల ద్వారా, డబ్బాల ద్వారా నీరు తెచ్చుకుని పొదుపుగా వాడుకుంటున్నామని ఆటోనగర్ (Auto Nagar) వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద, మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు వేర్వేరుగా ధరలు నిర్ణయించి నీటి కనెక్షన్‌లు ఇచ్చి వేసవి గండం నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

నిధులు లేక నిలిచిపోయిన ఆటోనగర్ నిర్మాణ పనులు.. ఆవేదనలో కార్మికులు

Guntur Auto Nagar People Faces Drinking Water Scarcity : తాగునీటి ఎద్దడితో పాటు రహదారులు, డ్రైనేజీ సమస్యలు ఆటోనగర్‌ వాసులను ఇబ్బంది పెడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా అంతర్గత రహదారులు (Roads) వీలుగా లేవు. ఎప్పుడో అనుమతులు వచ్చినా నేటికి రోడ్ల నిర్మాణం చేపట్టలేదని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపంతో డ్రైనేజీలు మూసుకుపోయి మురుగు నిలిచి దుర్గంధం వెదజల్లుతోందని వాపోతున్నారు.

ప్రమాదాలు ఇక్కడ, ఆస్పత్రి ఎక్కడ? - దినదిన గండంలా ఆటోనగర్ కార్మికుల పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.