Double Murder in Mailardevpally : బంధాలు అనుబంధాలు మాయమైపోతున్నాయి. నేటి సమాజంలో డబ్బు, అస్తిపాస్తుల ముందు విలువలన్నీ మంటగలిసిపోతున్నాయి. మానవ సంబంధాలను ఎన్నడో మరిచి కేవలం మనీ బంధానికే విలువ ఇస్తున్నారు. ఇందుకోసం కన్నవారిని, కట్టుకున్న వారిని సైతం కడతేర్చడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఇల్లు విక్రయించగా వచ్చిన డబ్బుల పంపకం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. ఈ ఘర్షణలో చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రిని, అడ్డుపడిన మేనమామను అతి కిరాతకంగా యువకుడు హతమార్చాడు. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District Double Murder) సంచలనంగా మారింది.
Double Murder in Rangareddy District : మైలార్‌దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. డబ్బుల పంపకాల (MailardevpallyDouble Murder)విషయంలో కన్నతండ్రిని, మేనమామను దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. ఇన్‌స్పెక్టర్ మధు కథనం ప్రకారం రాజేంద్రనగర్ నియోజకవర్గం బాబుల్‌రెడ్డినగర్‌లో లక్ష్మీనారాయణ(55), అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాకేశ్(22) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబానికి భారీగా అప్పులున్నాయి. ఇందుకోసం రాకేశ్ అమ్మ అనిత పేరిట ఉన్న ఇంటిపై బ్యాంకు నుంచి రూ.15 లక్షల రుణం తీసుకున్నాడు.
Producer Anji Reddy Murder Case : నిర్మాత అంజిరెడ్డి హత్య.. ఆస్తి కోసం ప్రథకం ప్రకారం కుట్ర
Man Killed Father and Uncle in Rangareddy District : అప్పులు తీర్చడానికి రాకేశ్, కుటుంబం నివసించే 60 గజాల భవనాన్ని రూ.53 లక్షలకు విక్రయించాడు. అడ్వాన్సుగా వచ్చిన రూ.15 లక్షలతో నిందితుడు బ్యాంకు రుణం చెల్లించాడు. కొనుగోలు చేసినవారు ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని శనివారం వచ్చారు. వచ్చే డబ్బులో కొంత మొత్తం తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి వచ్చిన మేనమామ శ్రీనివాసులు(55) కోరాడు. వారికి ఇవ్వనని రాకేశ్ తేల్చి చెప్పాడు.
గొడవ కొనసాగుతుండగా ఏదోలా సద్దుమణుగుతుందని భావించిన మేనమామ శ్రీనివాసులు వీధిలోని దుకాణానికి వెళ్లాడు. తల్లిదండ్రులు తన మాట వినడంలేదని రాకేశ్ ఆగ్రహంతో తండ్రి లక్ష్మీనారాయణ చొక్కాపట్టుకొని కొడుతూ ఇంటి నుంచి ఈడ్చుకుంటూ బయట రోడ్డుపై పడేశాడు. తల్లి అడ్డుపడుతున్నా ఆగకుండా తండ్రి ముఖంపై బండరాయితో మోదాడు. ఇది గమనించిన మేనమామ అడ్డుపడ్డాడు. తిరిగి ఇంట్లోకి వెళ్లిన నిందితుడు ఇనుపరాడ్డు తీసుకొని వచ్చి తండ్రి, మేనమామల తలలపై బాదాడు. వారు రక్తం మడుగులో ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారని ఇన్‌స్పెక్టర్ మధు తెలిపారు.
ఆస్తి కోసం సొంత మామపై కత్తితో దాడి.. 20 సార్లు పొడిచి మరీ హత్య
Rangareddy District Double Murder : దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని ఇన్‌స్పెక్టర్ మధు తెలిపారు. మార్గం మధ్యలో తండ్రి లక్ష్మీనారాయణ మృతి చెందగా చికిత్స పొందుతూ మేనమామ శ్రీనివాసులు మరణించాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాకేశ్ అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మరోవైపు ఈ జంట హత్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
Murder: పెట్రోల్ పోసి నిప్పంటించి.. రాయితో కొట్టి.. సొంత తమ్ముడిని దారుణంగా చంపిన అన్న
ఆస్తి కోసం అత్త, మామ హత్య.. కిల్లర్లను పిలిచి టెర్రస్‌పై దాచి.. కోడలి పక్కా ప్లాన్