ETV Bharat / state

ఎక్కువగా బయటి ఫుడ్​ తింటున్నారా? - అయితే ఇవి తెలుసుకోండి - FOOD SAFTY OFFICERS IN TELANGANA

ఆహారం అన్ని చోట్లా కల్తీ మయం - అవగాహన, అప్రమత్తత ఎంతో అవసరం - తనిఖీల్లో బయటపడుతున్న ఉల్లంఘనలు

FOOD SAFTY OFFICERS IN TELANGANA
తనిఖీ చేస్తున్న అధికారులు, పక్కన కుళ్లిపోయిన మాంసం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2024, 4:59 PM IST

Food Adulteration in Telangana: మనం రోడ్డు వెంట నడుచుకుంటూ అలా వెళ్తుంటే అక్కడ ఓ హోటల్లో పొంగిన పూరీలను చూసి నోట్లో నీళ్లురుతాయి. కానీ అది ఎలాంటి నూనెలో తయారు చేశారో మనం తెలుసుకోలేం. రంగులతో ఆకర్షణీయంగా చేసిన స్వీటు తినడానికి రుచిగానే ఉంటుంది. కానీ ఆ రంగులను స్వీటుతో పాటు లాగించేస్తే క్యాన్సర్​కు దారీ తీస్తుందని చాలా మందికి తెలియదు. ఫైవ్​ స్టార్​ హోటల్‌లో చికెన్‌ బిర్యానీ మంచి వేడి వేడిగానే వడ్డిస్తారు.

ఫ్రిజ్‌లో దాచిన మాంసం మాత్రం తాజాదనే క్లారిటీ మాత్రం ఉండదు. బేకరీలోని కేకు, సాస్, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో మంచూరియా, నూడుల్స్, పెద్ద ఎత్తున పరిశ్రమలో భారీగా తయారు చేసే నమ్కీన్లు ఇలా తినుబండారాలు ఎక్కడపడితే అక్కడ హానికారకంగా తయారవుతున్నాయి. నిర్వాహకులు అధిక సంపాదన కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. బయటి ఫుడ్​ విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ఆహారంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి.

అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి : రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించేందుకు 2024 సెప్టెంబరు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లతో రెండు టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్​ను ఏర్పాటు చేసింది. ఒకటి హైదరాబాద్​ పరిధిలో కాగా మరోకటి జిల్లాల్లో. ఈ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 20 చోట్ల తనిఖీలు నిర్వహించగా కల్తీ ఘటనలు బయటపడ్డాయి. ఇటీవల మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ ప్రాంతంలో ఫుడ్​ప్రోడ్యూసింగ్​ తయారీ కేంద్రాన్ని అధికారులు చెక్​ చేశారు.

ఉత్పత్తిదారులు వ్యాలిడిటీ పూర్తయిన మసాలాలతో చిప్స్, ఇతర నమ్కీన్లను తయారు చేస్తున్నారు. ఒక పేరుతో అనుమతి తీసుకొని మరో ప్రముఖ బ్రాండ్‌ పేరుతో రిటైలర్లకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నల్గొండలో ఇంటర్​నేషనల్​ పేరున్న ఒక ఆహారశాలలో అధిక ఉష్ణోగ్రతతో పదేపదే కాచిన నూనెలను వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. సాధారణంగా వేడి చేయని నూనెలో టీపీసీ (టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌) 15 వరకు, కాచిన నూనెలో 20 వరకు ఉండొచ్చని ఫుడ్​ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏకంగా 35 టోటల్​ పోలార్​ కాంపౌండ్స్​ దాటింది. ఇలాంటి నూనెలు ప్రమాదకరమైన క్యాన్సర్లకు దారితీస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబరు నెలలో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక రెస్టారెంట్లో మోమోస్​తో పాటు మయోనైజ్‌ తిని ఒక మహిళ మృతి చెందడం, 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

రకరకాలుగా కల్తీ

  • అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ బరువుగా ఉండేందుకు అందులో బంగాళదుంప ముద్ద, లేదా అరటిపండు బోదెలు కలుపుతున్నారు.
  • మిఠాయిల్లో హానికారక రంగులు 100 పీపీఎం విలువను దాటడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
  • బేకరీల్లో గడువు పూర్తయిన జామ్, సాస్‌ యథేచ్ఛగా వాడుతున్నారు.
  • రెస్టారెంట్లలో వెజ్​, నాన్​వెజ్​ వేర్వేరు ఫ్రీజర్లలో భద్రపరచాల్సి ఉన్నా రెండిటిని ఒకే దాంట్లో నిల్వ చేస్తున్నారు.
  • పాత పప్పులకు రంగులు కలుపుతూ కొత్తగా వంటల్లో వినియోగిస్తున్నారు.
  • కుళ్లిపోయిన కూరగాయలను ఏ మాత్రం తీయకుండా అలానే వాడుతున్నారు.

నాణ్యమైన ఆహారం ప్రజల హక్కు : ఫుడ్​ సేఫ్టీ స్టాండర్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్​ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రకారం ఆహార పదార్థాల్లో నాణ్యతపై సందేహం ఉంటే నమూనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్​కు పంపించవచ్చు. పరీక్షలకయ్యే ఖర్చును మాత్రం వినియోగదారుడే భరించాలి. వస్తువు కొనేముందు దానిపై గడువు తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ కాలాన్ని కూడా పరిశీలించాలి. చూడటానికి పాడైనట్టు ఉన్నా, ఎక్కువ రంగులు కనిపించినా, దుర్వాసన వచ్చినా వాటిని మాత్రం అస్సలు కొనుగోలు చేయొద్దు.

FOOD SAFTY STANDERS
ఆహార కల్తీపై ఫిర్యాదులకు నంబరు (ETV Bharat)

తినే ఫుడ్​ కల్తీ జరిగిందని గుర్తిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్‌ టీంలతో తనిఖీలు పెంచాం. ఉల్లంఘనులకు పాల్పడితే నోటీసులు ఇస్తున్నాం. పదిరోజుల్లో వాళ్లు పొరపాటు సరిదిద్దుకొని మళ్లీ మాకు వివరాలు తెలియజేయాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌తోపాటు, రాష్ట్ర ఆహార భద్రత డిపార్ట్​మెంట్​కు నేరుగా వాట్సప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. - ఆర్‌.వి.కర్ణన్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్

యాసిడ్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ - ఇది చూస్తే ఇంకెప్పుడూ బయట కొనరు

ఆహార పదార్థాలు వేయగానే నూనె పొంగుతోందా? - అయితే అది కచ్చితంగా కల్తీదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.