Director Ram Gopal Varma Anticipatory Bail Petition : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాంగోపాల్ వర్మ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Police Notices to Varma : వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశారని అభియోగాలు ఉన్నాయి. ఇదే విషయమై తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు సైతం కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసు విచారణకు హాజరు కావాలంటూ ఎస్సై శివ రామయ్య ఆధ్వర్యంలోని బృందం నవంబర్ 13న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న వర్మ ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వర్మ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. ఈ నెల 19న విచారణ హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారని, హాజరయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
ఈ సందర్భంగా వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. విచారణకు హాజరుకావాలనే గడువు పొడిగింపు కోసం పోలీసులు ముందు అభ్యర్థన చేసుకోవాలని, కోర్టు ముందు కాదని న్యాయస్థానం స్పష్టం తెలిపింది. ఇదిలావుంటే రామ్‌గోపాల్‌వర్మకు ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని గ్రామీణ సీఐ ఎన్. శ్రీకాంత్‌బాబు సదరు నోటీసులో పేర్కొన్నారు.
పోలీసుల విచారణకు వర్మ డుమ్మా - వాట్సాప్‌లో ఏం మెసేజ్ చేశారంటే!
హైకోర్టులో పిటిషన్ దాఖలు : సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ రాంగోపాల్ వర్మ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందని అన్నారు.
పోలీసు విచారణకు ఆర్జీవీ గైర్హాజరు : రాంగోపాల్ వర్మ ఒంగోలులో మంగళవారం పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పట్ల ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసు అందజేశారు. పోలీసులు సూచించిన మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్జీవీ తరఫున న్యాయవాది ఎన్.శ్రీనివాసరావు హాజరయ్యారు. షూటింగుల్లో బిజీగా ఉన్నందున హాజరుకావడం లేదని, వారం సమయమివ్వాలని ఆయన పంపిన లేఖను అందజేశారు.
ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు - అరెస్టుపై ఆందోళన
చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై ఆర్జీవీ పోస్టు - పలు స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదు