Dilsukhnagar Bomb Blast Mastermind Syed Maqbool Died : హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది సయ్యద్ మఖ్బూల్(52) అనారోగ్యంతో కన్నుమూశాడు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సయ్యద్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల రోజుల క్రితం ఈ ఉగ్రవాదికి గుండె ఆపరేషన్ జరిగింది. ఆతర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజుల క్రితం పల్స్ పడిపోవడంతో జైలు అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టెర్రరిస్ట్ సయ్యద్ గురువారం తెల్లవారుజామున మరణించాడు. స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్.
ఉగ్రసంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి అత్యంత సన్నిహితుడిగా సయ్యద్ మఖ్బూల్కు పేరుంది. యాసిన్ భత్కల్ సహా మరికొందరితో కలిసి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పేలుళ్ల వెనుక సూత్రధారి అని అభియోగాలు ఉన్నాయి. 2006లో వారణాసి, 2007లో ముంబయి వరుస పేలుళ్లు, 2008లో జైపుర, 2008లో దిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతో పాటు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ ప్రస్తావించింది. ఎన్ఐఏ అరెస్ట్‌తో గత కొన్నేళ్లుగా తిహాడ్ జైల్లో ఉన్న అతడిని ఆరు నెలల క్రితం చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ బాంబు పేలుళ్లు, నిజామాబాద్ హత్య కేసులో సయ్యద్ నిందితుడు అని అధికారులు తెలిపారు.
బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks
ఎన్నికల వేళ - పల్నాడు జిల్లాలో బాంబుల కలకలం - police Found Bomb in Palnadu