ETV Bharat / state

కర్నూలులో ప్రబలిన అతిసారం - చిన్నారి మృతి - DIARRHEA SPREADS IN KURNOOL

Diarrhea Spread in Kurnool: కర్నూలు జిల్లాలో అతిసారం ప్రబలింది. సుంకేశ్వరి గ్రామంలో నాలుగేళ్ల పాపను బలి తీసుకుంది. ఈ వ్యాధితో మంత్రాలయం, ఆదోని ఆసుపత్రిలో 40 మంది బాధితులు చేరారు. ఘటనపై మంత్రి భరత్​ స్పందించారు. వెంటనే వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 1:30 PM IST

Updated : Jul 15, 2024, 1:35 PM IST

Diarrhea Spread in Kurnool
Diarrhea Spread in Kurnool (ETV Bharat)
కర్నూలులో ప్రబలిన అతిసారం - చిన్నారి మృతి (ETV Bharat)

Contaminated Drinking Water Problem in Kurnool : జలం కలుషితమై ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఇలాంటి నీరును తీసుకోవడం వల్ల అతిసారం ప్రజల ప్రాణాలను కాటు వేస్తోంది. ప్రజలకు మంచినీరు అందించాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది. పైపులు లీకేజీ అవుతున్నాయని, రంగు మారిన నీరు వస్తోందని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో అతిసారం బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కొల్పోతే, మరికొందరు మృత్యువుతో పోరాడి బయట పడినా వారు ఉన్నారు.

డయేరియా అలజడి : మొన్నటి వరకు విజయవాడ, మొగల్రాజుపురంలో ప్రబలిన డయేరియా ఇప్పుడు కర్నూలు జిల్లాలో అలజడి రేపుతోంది. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారం ప్రబలింది. నాలుగేళ్ల పాపను బలి తీసుకుంది. వాంతులు, విరేచనాలతో జ్యోతి మృతి చెందగా మరో పలువురు మంత్రాలయం, ఆదోని, రాయచోటి ఆస్పత్రుల్లో చేరారు. కలుషిత నీటి వల్లే డయేరియా విజృంభిస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.

చికిత్స అందిస్తున్నాం: సుంకేశ్వరీ గ్రామంలో 30 మంది అతిసారం బారిన పడినట్లు కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సురేష్ తెలిపారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి డయేరియా బారిన పడిన రోగులకు చికిత్స అందించామని, సీరియస్​గా ఉన్న వారిని ఎమ్మిగనూరు, ఆదోని ఆసుపత్రులకు రిఫర్ చేశామని చెప్పారు. జ్యోతి అనే బాలిక మరణానికి ఇతర కారణాలు ఉండొచ్చని తెలిపారు.

పిడుగురాళ్లలో డేంజర్​బెల్స్​ - విజృంభిస్తున్న డయేరియా - Diarrhea Spreds in Paldadu District

శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని పలుమార్లు అధికారులు కోరినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిసారం బారిన పడినవారికి చికిత్స కోసం వైద్య శిబిరాలు కూాడా ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బులతో చెల్లించి ప్రైవేట్​ ఆసుపత్రులకు వెళ్తున్నామని పేర్కొన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియాను అరికట్టాలని కోరుతున్నారు.

పల్నాడు జిల్లాలో డయేరియా అలజడి- వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న రోగులు - Diarrhea Cases in Palnadu District

మంత్రి స్పందన : కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో అతిసారంపై మంత్రి టీజీ భరత్​ స్పందించారు. ఈ విషయంపై జాయింట్​ కలెక్టర్​తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు, సిబ్బందిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

People Fell Illness After Drinking Contaminated Water in Adoni : గతంలో ఆదోని మండలం ఇస్వి గ్రామంలో కలుషిత నీరు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. మంచినీరు ఎర్ర రంగుతో వస్తున్నా వాటిని శుద్ధి చేయకుండానే అధికారులు సరఫరా చేశారు. రంగుమారిన నీరును గ్రామస్థులు తాగడంతోనే అతిసారం విజృంభించింది. కలుషిత నీరు తాగి వాంతులు, విరోచనాలతో 30 మంది అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur

Last Updated : Jul 15, 2024, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.