Diarrhea at Love and Light Orphan Home in Karakavalasa: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కరకవలసలోని లవ్ అండ్ లైట్ ఆర్ఫన్‌హోమ్‌లో డయేరియా కలకలం రేపింది. 18 విద్యార్థులు డయేరియా బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఆరు మందిని ఆస్పత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ఇద్దరు విద్యార్థులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మిగిలినవారికి శృంగవరపుకోట ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
డయేరియా బారినపడిన విద్యార్థులను శృంగవరపుకోట మండలం చిట్టంపాడుకు చెందిన వారిగా గుర్తించారు. గత మూడు రోజులుగా ఆర్ఫన్‌లో ఉంటున్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. సంస్థ నిర్వహకులు హోంలో ఉంటున్న 46 మంది విద్యార్థులను ఇళ్లకు పంపించారు. బాధితులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అందేశించారు.
చిట్టెంపాడు గ్రాంలోని పిల్లలు ట్రస్టు స్కూల్లో చదువుతున్నారు. అక్కడ వారు కలుషిత ఆహారం తినడం వల్ల అనారోగ్యపాలయ్యారు. వారికి డయోరియా రావడానికి కారణం ప్రధానంగా వాతావరణంలోని మార్పుల వల్ల వర్షాలు రావడం వల్ల ఈ డయేరియా కేసులు రావడం జరిగింది. వెంటనే మండల స్థాయి అధికారులందరు అప్రమత్తమై విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం విశాఖలో చేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగింది.- కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్యే
డయేరియాతో ఇద్దరు మృతి- మరో ఐదుగురి పరిస్థితి విషమం - 2 Died in Tirupati with diarrhea
ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur