ETV Bharat / state

ధరణి పోర్టల్ ఐచ్ఛికాల్లో కీలక మార్పులు - భూ సమస్యలన్నింటికీ ఒకే అర్జీ ఉండాలన్న కమిటీ - Dharani portal defects

Dharani Portal Issues 2024 : తెలంగాణలో ధరణి అవకతవకలపై ప్రభుత్వం వేసిన కమిటీ అందులోని లోపాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా కమిటీ, పోర్టల్‌లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించింది. భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు ఉండాలని తెలిపింది. ఈ మేరకు రెవెన్యూశాఖకు ప్రాథమికంగా కమిటీ సభ్యులు సూచించినట్లు తెలిసింది

Dharani Portal in Telangana
Dharani Portal in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 9:41 AM IST

Dharani Portal Issues 2024 : రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ వ్యవస్థపై (Dharani Portal in Telangana) మరింత లోతైన అధ్యయనం చేసే దిశగా సర్కార్ నియమించిన కమిటీ ముందుకు వెళ్తోంది. సాగు భూమికి పట్టా పాసుపుస్తకం జారీ కావాలంటే ముందుగా ఖాతా సమాచారం, సర్వే నంబర్లు, విస్తీర్ణానికి సంబంధించిన వివరాలన్నీ స్పష్టంగా ఉండాలి. కానీ వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకున్నా పట్టాదారు పుస్తకం జారీ కాదు. వారికి యాజమాన్య హక్కులూ రావు. తెలంగాణలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్న అన్నదాతలకు న్యాయం జరగకపోవడానికి ఉన్న కారణాల్లో దరఖాస్తు చేసుకునే విధానం తెలియకపోవడం ఒక కీలకాంశంగా ధరణి కమిటీ గుర్తించింది.

Dharani Portal Problems 2024 : ఇందులో భాగంగా ధరణి పోర్టల్‌లో ఉన్న సాంకేతిక సమస్యలపై కమిటీ వరుస సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పెండింగ్‌ సమస్యలు తగ్గకపోవడంపై దృష్టి సారించగా, పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇటీవల 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశమైనప్పుడు పలు కీలక అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలకూ ఒకే దరఖాస్తు విధానం ఉండటం మేలని, పోర్టల్‌లో మార్పులు (Dharani Portal Problems) చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు రెవెన్యూశాఖకు ప్రాథమికంగా సూచించినట్లు తెలిసింది.

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్​లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్

పోర్టల్‌లో కమిటీ గుర్తించిన లోపాలు :

  • ధరణి పోర్టల్‌లో అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఐచ్ఛికాలు లేవని ధరణి కమిటీ నిర్ధారించింది.
  • మాడ్యూళ్ల పేరుతో టీఎం-1 నుంచి టీఎం-35 వరకు ఏర్పాటు చేశారు. కానీ వాటిలో ముప్పావుభాగం సేవలు, సమాచారం తెలిపేవే ఉన్నాయి.
  • పరిష్కార బాధ్యతల అధికారం కలెక్టర్లకు ఉంది. కానీ భూ విచారణ అంతా తహసీల్దార్లు చేపట్టాలి. ఈ సందర్భంగా సమన్వయలోపం ఎదురైతే ఆ అర్జీ కథ మళ్లీ మొదటికి వస్తోంది.
  • టీఎం-33 మాడ్యూల్‌ కింద అన్ని రకాల సమస్యలకు అర్జీ చేసుకోవచ్చని 2022లో రెవెన్యూశాఖ సూచించింది. అయినా చాలా సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు లేక పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.

Dharani Portal in Telangana : మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతుకు రెండు సర్వే నంబర్లలో నాలుగు ఎకరాల పొలం ఉంది. ధరణి పోర్టల్‌లో (Dharani Committee) ఒక సర్వే నంబరే కనిపిస్తోంది. మరొకటి కనిపించడం లేదు. భూవిస్తీర్ణం కూడా తక్కువ నమోదైంది. దీంతో పాసుపుస్తకం రాలేదు. ఈసమస్యలతో చాలాసార్లు ఆయన మీ సేవా కేంద్రాల ద్వారా అర్జీ పెట్టుకున్నారు.

Five Members Committee on Dharani Portal : ముందుగా తక్కువ విస్తీర్ణం సమస్యపై, తరువాత మిస్సింగ్‌ సర్వే నంబరుకు, అనంతరం పాసుపుస్తకం జారీకి దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఒక్కో అర్జీకి రూ.1200 అవుతోంది. దీనికి జిరాక్స్‌, పత్రాలు అప్‌లోడ్‌ చేయడానికి అదనంగా చెల్లించాలి. ఇలా ఎన్నిసార్లు అప్లై చేయాలి ఎన్నాళ్లు వేచిచూడాలంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ధరణి పోర్టల్​ను కొనసాగిస్తారా? లేదా? - స్పష్టత ఇవ్వండి : హైకోర్టు

ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్‌ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.