Dharani Committee On Portal Software : భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత సర్కార్ ధరణి పోర్టల్ (Dharani Portal in Telangana) పరిధిలోకి తీసుకొచ్చింది. సంకల్పం గొప్పదైనా ఆచరణలో మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడగానే దీనిపై అధ్యయనానికి కమిటీని వేసింది. నాలుగుసార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైంది. కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది.
Dharani Portal Problems 2024 : రాష్ట్రంలో భూసమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని, చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది. సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన కమిటీ సభ్యులు, ధరణి పోర్టల్ సవరణ మార్గదర్శకాలు, చట్టబద్దత లేకపోవడంపై ప్రశ్నలు అడిగారు. కమిటీ సూచన మేరకు ఏడు అంశాలపై కలెక్టర్లు వివరాలను అందించారు.
ధరణి పోర్టల్‌ను కొనసాగిస్తారా? లేదా? - స్పష్టత ఇవ్వండి : హైకోర్టు
ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థ టెర్రాసిస్ ప్రతినిధులతోనూ సుదీర్ఘంగా కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్‌వేర్‌కు (Dharani Portal Problems) సంబంధించి మాడ్యుల్స్ ఎలా పనిచేస్తున్నాయి? దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ ఏ దశల్లో సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుంది? ఎదురవుతున్న సమస్యలపై లోతుగా ఆరా తీశారు. సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యుల్స్ అవసరమని, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్‌లైన్‌లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.
Dharani Portal in Telangana : చట్టం తెచ్చినప్పటికీ అధికారులకు ఏలాంటి అధికారాలు ఉంటాయో స్పష్టత ఇవ్వలేదని, చట్టాన్ని సమర్ధంగా అమలు చేసేందుకు తగిన మార్గదర్శకాలు గత ప్రభుత్వం ఇవ్వలేదని కమిటీ దృష్టికి కలెక్టర్లు తెచ్చినట్లు తెలుస్తోంది. 18లక్షల ఎకరాలు భూమి పార్ట్-బీ నిషేదిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా, అనధికారికంగా 23 లక్షల ఎకరాలు ఉన్నట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం.
ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత
Five Members Committee on Dharani Portal : బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తున్న సమస్యలు, గ్రామస్థాయిలో ధరణి సమస్యల పరిష్కారానికి తగిన యంత్రాంగం లేకపోవడం వల్ల ఎదురువుతున్న ఇబ్బందులు, చట్టపరంగా చేయాల్సిన మార్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 35 మ్యాడ్యూల్స్ తీసుకొచ్చినా రైతు సమస్యల పరిష్కారానికి ప్రయోజనం లేని విధంగా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఇన్ని మ్యాడ్యూల్స్ తెచ్చినా సాధారణ పౌరులకు అర్థమయ్యేలా లేకపోవడంతో అవి ఎందుకు ఉపయోగపడనవిగా మారాయని కమిటీ అభిప్రాయపడుతోంది.
Telangana Government Committee on Dharani Portal : గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు లేరని కమిటీ (Dharani Committee) దృష్టికి కలెక్టర్లు తీసుకొచ్చారు. ధరణి పోర్టల్ పేరుకే గొప్పగా ఉందని అమలులో అడుగడుగున లోపాలు ఉండడంతో సమస్యల పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది. నోడల్ అధికారులుగా కొనసాగుతున్నకలెక్టర్లు సైతం ధరణి సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్‌లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్
'ధరణిలో లోపాలు అనేకం - వీలైనంత త్వరలో మధ్యంతర నివేదిక ఇస్తాం'