ETV Bharat / state

తిరుమలకు భారీగా భక్తులు - శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం - HEAVY RUSH TIRUMALA

తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ - దీపావళి, వారాంతపు సెలవు కలిసి రావడంతో పోటెత్తిన భక్తులు

heavy_rush_tirumala
heavy_rush_tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 4:44 PM IST

Devotees Flocked in Large Numbers to Visit Tirumala: తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీపావళి పండుగ సెలవులకు వారంతపు సెలవులు కలిసి రావడంతో శ్రీవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులు తాకిడి పెరగడంతో ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లోని అన్ని కంపార్ట్​మెంట్​లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని పూర్తిగా నిండి వెలుపలకు వచ్చిన క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసారు. వెలుపల క్యూ లైన్​లో ఉన్న భక్తులతో పాటు కంపార్ట్​మెంట్​ల షెడ్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు నిర్విరామంగా పానీయాలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది వాహన రాకపోకలను, వాహనాల పార్కింగ్​ను పర్యవేక్షిస్తున్నారు.

కాగా అంతకు ముందు నిన్న తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్‌ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని 67,785 మంది భక్తులు దర్శించుకోగా 27,753 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.38 కోట్లు వచ్చింది.

నాగార్జునసాగర్​-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే

మహా మాయగాళ్లు - మాటలతో లాక్ చేస్తారు - ఆపై అందినకాడికి సొమ్ము కాజేస్తారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.