Bhadrachalam devotees Facing problems with Dirt : భద్రాచలం రామాలయం అన్నదాన సత్రం వద్ద మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. రెండు రోజుల కింద కురిసిన వర్షాలతో అన్నదాన సత్రం, రామాలయం పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్ దుకాణాలను మురుగునీరు ముంచెత్తింది. దీంతో అన్నదాన సత్రం పరిసరాలు బురదమయంగా మారిపోయాయి. సత్రం లోపల శుభ్రం చేసినా చుట్టుపక్కల ప్రాంతాల్లో బురద రెండు రోజుల నుంచి అలాగే ఉండిపోయి దుర్వాసన వస్తోంది.
బ్లీచింగ్ చేసినా బురద తొలగించక ఈగలు, దోమలు చేరి ఆ ప్రాంతమంతా కంపు కొడుతోంది. దర్శనం, అన్నదానం కోసం వెళ్లే భక్తులు బురదలో నుంచి వెళ్లాల్సి వస్తోంది. బురద తొలగించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు వ్యాపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'రెండ్రోజులు క్రితం గోదావరి ఉద్ధృతికి చెరువు కట్టి తెగి నీళ్లు వచ్చాయి. దీంతో ఆలయ సమీపంలో అన్నదాన సత్రం వద్ద మురుగు నీరు చేరకుంది. ఈ బురద వల్ల ఈగలు, దోమలు చేరి ఆ ప్రాంతమంతా కంపు కొడుతోంది. చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు పట్టించుకోవడం లేదు. అన్నదానం కోసం వెళ్లే భక్తులు బురదలో నుంచి వెళ్లాల్సి వస్తోంది'-స్థానికురాలు
భద్రాచలంలో భారీ వర్షం - కుంగిన కల్యాణ మండపాన్ని కూల్చిన అధికారులు - BHADRACHALAM RAINS TODAY NEWS