ETV Bharat / state

దిగువన కళకళలాడుతూ - ఎగువన వెలవెలబోతున్న గోదారి - కారణమిదే! - Irrigation Projects water levels

Godavari River Basin Irrigation Projects : మహారాష్ట్ర నుంచి గోదావరికి వచ్చి చేరుతున్న వరద ఉద్ధృతి తక్కువగానే ఉంది. అయితే దిగువ ప్రాంతంలో ఉప నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాలో గోదావరి నదిలోకి వరద ప్రవాహం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటే, మహారాష్ట్ర నుంచి పెద్దగా వరద రాకపోవడంతో ప్రాజెక్టులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అనుకున్న మేరకు ప్రవాహం జాడ కనబడటం లేదు.

Telangana Irrigation Projects
Telangana Irrigation Projects (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 1:13 PM IST

Irrigation Projects on Godavari : రాష్ట్రం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరద ఉద్ధృతి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. అయితే దిగువ ప్రాంతంలో ఉప నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది పొంగిపొర్లుతోంది. రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో నీరు లేక బోసిపోయినట్టుగానే కనిపిస్తోంది.

మహారాష్ట్ర నాసిక్‌లో పుట్టిన గోదావరి నది మొత్తం 1400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రాష్ట్రంలో మాత్రం నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. కందకుర్తి నుంచి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అక్కడి నుంచి కడెం ప్రాజెక్టు మీదుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి ప్రవహిస్తుంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాలో గోదావరి నదిలోకి వరద ప్రవాహం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటే, మహారాష్ట్ర నుంచి పెద్దగా వరద రాకపోవడంతో ప్రాజెక్టులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అనుకున్న మేరకు ప్రవాహం జాడ కనబడటం లేదు.

కడెం ప్రాజెక్టుతో పాటు శ్రీపాద ఎల్లంపల్లిలో ప్రవాహం ఇప్పుడిప్పుడే వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం జలాలపై ఆధారపడ్డ మధ్యమానేరుతో పాటు దిగువ మానేరుకు ఇప్పటి వరకు ఇన్‌ఫ్లోనే ప్రారంభం కాలేదు. దిగువ మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.80 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫ్లో 925 క్యూసెక్కులే కొనసాగుతోంది. కరీంనగర్ దిగువ మానేరు జలాశయ సామర్ధ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.215 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫ్లో కేవలం 945 క్యూసెక్కులు మాత్రమే ఉన్నాయంటే, పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

కుమురం భీం ప్రాజెక్టుపై ఈటీవీ భారత్​ కథనం - స్పందించిన కలెక్టర్ - Collector reacts To ETVBharat Story

ఆదిలాబాద్ జిల్లా మీదుగా వచ్చే వరద నీరు కడెం ప్రాజెక్టుకు మరింత చేరితే, అప్పుడు గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లికి వరద నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు నామమాత్రంగానే వస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటికీ భారీ వరద మాత్రం రావడం లేదు. దీంతో ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 21.37 టీఎంసీలకు మాత్రమే చేరింది. ఎస్సారెస్పీ 90 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరినా, గేట్లను ఇప్పట్లో ఎత్తే అవకాశాలు కనిపించడం లేదు. అందువల్ల దిగువ ప్రాంతాలైన జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎస్సారెస్పీ ద్వారా వరద నీరు రావడం లేదు.

కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, ఇన్ ఫ్లో 4863 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటు ఎత్తి దిగువకు 3389 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.56 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 2,433 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది.

సుందిళ్ల, పార్వతీ బ్యారేజీకి 8.83 టీఎంసీల సామర్థ్యం ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువ ప్రాంతానికి వదిలేస్తున్నారు అధికారులు. ఇక్కడికి ఇన్ ఫ్లో 4970 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతీ బ్యారేజీకి 19,600 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరుతుండగా, మొత్తం నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మహదేవపూర్​లోని మేడిగడ్డ వద్దకు వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

తెరుచుకున్న జూరాల 32 గేట్లు - పరివాహక ప్రాంతాలు అప్రమత్తం - JURALA PROJECT 32 GATES OPEN

మహారాష్ట, తెలంగాణ సరిహద్దుల మీదుగా ప్రవహిస్తున్న కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తున్న ప్రాణహిత నదిలో ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వరద పోటు తీవ్ర రూపం దాల్చుతోంది. 16 టీఎంసీ సామర్ధ్యం ఉన్న మేడిగడ్డ వద్ద 9 లక్షల 54 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా, పూర్తిస్థాయిలో నీటిని కిందకు వదిలేస్తున్నారు. ప్రాణహిత నది పొంగిపొర్లుతుండటంతో ఇక్కడ వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు చేరుతున్న నీటిని కిందకు వదిలేయాలని ఎన్​డీఎఫ్ ఆదేశించడంతో అధికారులు మూడు బ్యారేజీల గేట్లను ఎత్తి ఉంచారు. దీంతో ఇక్కడకు వచ్చి చేరుతున్న నీరంతా కూడా దిగువకు వెళ్లిపోతోంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల మీదుగా ప్రవహిస్తున్న ఇంద్రావతి నది నీరు పలిమెల మండలం దమ్మూరు వద్ద కలుస్తోంది. అలాగే ఇతర క్యాచ్ మెంట్ ఏరియాల నీరు అంతా ములుగు జిల్లాలోని తుపాకుల గూడెం సమ్మక్క సారలక్క బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ఈ బ్యారేజీ గేట్లు ఎత్తడంతో పాటు, వాజేడు మండలం పాలెం వాగు గేట్లు కూడా ఎత్తారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ప్రవహిస్తున్న మరో నది శబరి కూడా పొంగిపొర్లుతోంది.

కాళేశ్వరం వద్ద నీటి మట్టం 103.68 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న లోతట్టు గ్రామాలు కుంట్లం, పాల్గుల, అన్నారం, చండ్రుపల్లి, మద్దులపల్లి, నాగేపల్లి, కాళేశ్వరం, పుస్కుపల్లి, మాజీద్‌పల్లి, మెట్‌పల్లి, పెద్దంపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం - 51.4 అడుగులకు చేరిన నీటిమట్టం - కాసేపట్లో మూడో వార్నింగ్ - BHADRACHALAM GODAVARI FLOODS UPDATE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.